Begin typing your search above and press return to search.

బన్నీని అన్నగానే ఫిక్సయ్యిందే

By:  Tupaki Desk   |   16 Jan 2018 8:55 AM GMT
బన్నీని అన్నగానే ఫిక్సయ్యిందే
X
ఓ సినిమాలో హీరోకు సిస్టర్ గా నటించినంత మాత్రాన.. అదే టైపులో ఫిక్స్ అవాల్సిన పనేమీ లేదు. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా విపరీతంగా మెప్పించింది. పోనీ ఆ పాత కాలం రిఫరెన్సులు వద్దనుకుంటే.. రీసెంట్ గా ఆమిర్ ఖాన్ మూవీ దంగల్ లో కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్.. ఇప్పుడు థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ లో హీరోయిన్ గా నటించేస్తోంది.

అయితే.. తెలుగు స్టార్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీముఖి మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతోంది. ఈ భామ జులాయి మూవీలో అల్లు అర్జున్ కి చెల్లెలిగా నటించిన సంగతి తెలిసిందే. అలాగని ఎప్పటికీ స్టైలిష్ స్టార్ ని అన్నగా ఫిక్స్ అవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ రీసెంట్ గా అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన శ్రీముఖి.. 'మా జులాయి బ్రదర్ ను కలిశాను. చాలా కాలం తర్వాత' అంటూ చెప్పుకొచ్చింది. ఇలా ఓ స్టార్ హీరోను అన్నయ్యగా చెప్పడం అంటే చాలానే ధైర్యం చేసేసినట్లే అని చెప్పాలి.

ఆన్ స్క్రీన్ లో సోదరుడిగా నటించినా.. ఆఫ్ స్క్రీన్ లో ఆ రిలేషన్ చెబితే.. ఇక ఎప్పటికీ ఆమెకు జోడీగా కాకపోయినా కనీసం మరదలిగా కూడా నటించే ఆఫర్ రాకపోవచ్చనే భయాలుంటాయి. కానీ శ్రీముఖి మాత్రం ఈ విషయంలో ఎలాంటి సంశయాలు పెట్టుకోకుండా బోలెడంత ధైర్యం చేసేసి.. స్టైలిష్ స్టార్ ను అన్నయ్య చేసేసింది.