Begin typing your search above and press return to search.

ఆ హీరో మీసం తిప్పుతాడట

By:  Tupaki Desk   |   22 Jun 2018 12:48 PM GMT
ఆ హీరో మీసం తిప్పుతాడట
X
టాలీవుడ్ లో ప్రస్తుతం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోల్లో శ్రీ విష్ణు టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. చేస్తున్న కొత్త కొత్త ప్రయోగాలు కమర్షియల్ గా విజయం సాధించడం లేదు గాని నటుడిగా మంచి గుర్తింపును ఇస్తున్నాయని చెప్పవచ్చు. చివరగా నీధి నాది ఒకే కథ అంటూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసిన శ్రీ విష్ణు మరొక ఫీల్ ను ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అది కూడా మాస్ తరహాలో ట్రై చేస్తున్నాడు.

కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో తిప్పర మీసం అనే సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు నారా రోహిత్ తో అసుర సినిమా చేశాడు. ఇక ఈ రోజు రామానాయుడు స్టూడియోలో మినిష్టర్ తలసాని శ్రీనివాస్ - హీరో నారా రోహిత్ ముఖ్య అతిధులుగా విచ్చేసి సినిమా లంచ్ లో పాల్గొన్నారు. నారా రోహిత్ మొదటి క్లాప్ ఇచ్చాడు. తిప్పార మీసం టైటిల్ కి తగ్గట్టుగా శ్రీ విష్ణు లుక్ సరికొత్తగా ఉందని చెప్పాలి. అసలు మొదటి సారి చూసినప్పుడు అసల ఇతను శ్రీ విష్ణు.. అని నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.

అంతలా తన క్లాస్ లుక్ ని మాస్ లుక్ లోకి మార్చేశాడు శ్రీ విష్ణు. ఇక దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సిద్ వర్క్ చేయనున్నారు. ఇక రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ - శ్రీ ఓం సినిమా బ్యానర్లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.