Begin typing your search above and press return to search.

స్పీడు మీదున్న శ్రీవిష్ణు!

By:  Tupaki Desk   |   10 Oct 2019 1:30 AM GMT
స్పీడు మీదున్న శ్రీవిష్ణు!
X
టాలీవుడ్ లో విభిన్న కథాంశాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోల లిస్టు తీస్తే అందులో తప్పనిసరిగా శ్రీవిష్ణు పేరు ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ పై ఫోకస్ పెడుతూ సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. పోయినేడాది 'నీది నాది ఒకే కథ' తో మెప్పించిన శ్రీవిష్ణు 'వీరభోగ వసంతరాయలు' సినిమాతో నిరాశపరిచాడు. అయితే ఈ ఏడాది 'బ్రోచేవారెవరురా' సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు విష్ణుకు ఫుల్ డిమాండ్ ఉందని టాక్.

శ్రీవిష్ణు ప్రస్తుతం 'తిప్పరా మీసం' అనే సినిమాలో నటిస్తున్నాడు. శ్రీవిష్ణు కొత్త గెటప్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్లు.. టీజర్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం అయింది. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీవిష్ణు తన కెరీర్ లో పోలీసు పాత్రలో నటించడం ఇదే మొదటిసారి.

ఈ సినిమానే కాకుండా మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలలో ఉన్నాయని అంటున్నారు. శ్రీవిష్ణు రెమ్యూనరేషన్ కూడా కోటికి అటూ ఇటూగా ఉందని.. దీంతో చాలామంది నిర్మాతలు శ్రీవిష్ణుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ప్రస్తుతం లైన్లో ఉన్న ప్రాజెక్టులలో ఏవి హిట్ అయినా శ్రీవిష్ణు నెక్స్ట్ లీగ్ కు చేరడం ఖాయమే.