శ్రీవిష్ణు వారికంటే చాలా విభిన్నంగా ఉన్నాడు!

Sun Oct 21 2018 13:11:33 GMT+0530 (IST)

నారా రోహిత్ - సుధీర్ బాబు - శ్రీ విష్ణు - శ్రియ కీలక పాత్రల్లో నటించిన ‘వీరభోగ వసంత రాయలు’ విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని నారా రోహిత్ - సుధీర్ బాబు - శ్రియల లుక్ లు రివీల్ అయిన విషయం తెల్సిందే. వారి లుక్స్ తో సినిమాకు హైప్ వచ్చింది. ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్న శ్రీ విష్ణు లుక్ రివీల్ చేయలేదు. టీజర్ - ట్రైలర్ లో కూడా శ్రీవిష్ణును చూపించలేదు. తాజాగా శ్రీవిష్ణు లుక్ రివీల్ చేశారు. శ్రీవిష్ణు లుక్ చాలా విభిన్నంగా ఉంది.ఇప్పటి వరకు శ్రీవిష్ణు కనిపించిన పాత్రలకు ఈ పాత్రకు పూర్తి విభిన్నంగా - విరుద్దంగా ఉందనే టాక్ వస్తుంది. ఒంటి నిండా టాటూలతో పాటు సిక్స్ ప్యాక్ బాడీతో శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని - ఈ లుక్ తో తేలిపోయింది. ఈయన పాత్ర ఏంటా అంటూ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరభోగ వసంత రాయలు చిత్రం చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. తాజాగా శ్రీవిష్ణు లుక్ కూడా అదే క్లారిటీ ఇస్తోంది.

ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశ భక్తి నేపథ్యంలో సాగుతుందని - శ్రియ మరియు నారా రోహిత్ ల పాత్రలు సినిమాలకు హైలైట్ గా ఉంటాయంటున్నారు. సుధీర్ బాబు - శ్రీవిష్ణు ల పాత్రలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముగ్గురు హీరోల మల్టీస్టారర్ చిత్రం అవ్వడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దసరా సీజన్ పూర్తి అయిన నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.