Begin typing your search above and press return to search.

శ్రీముఖి డిజప్పాయింట్ చేసేసిందే..

By:  Tupaki Desk   |   23 March 2017 7:19 AM GMT
శ్రీముఖి డిజప్పాయింట్ చేసేసిందే..
X
బుల్లితెరపై సూపర్ పాపులారిటీ సంపాదించిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె లుక్.. ఆమె మాట.. అన్నింట్లోనూ గ్లామర్ టచ్ ఉంటుంది. దీంతో చాలా వేగంగా బుల్లితెరపై రైజ్ అయింది శ్రీముఖి. ఈ పాపులారిటీతో కొన్ని సినిమా అవకాశాలు కూడా సంపాదించింది శ్రీముఖి. ఐతే ఇప్పటిదాకా ఆమె చేసినవన్నీ చిన్నా చితకా క్యారెక్టర్లే. వాటిలో ఆమె చాలా పద్ధతిగానే కనిపించింది. ఐతే ‘బాబు బాగా బిజీ’ లాంటి అడల్ట్ కామెడి లో శ్రీముఖి నటిస్తుండేసరికి ఆమెలోని కొత్త యాంగిల్ చూడబోతున్నామని ఆశించారు కుర్రాళ్లు. కానీ వారి ఆశలపై శ్రీముఖి నీళ్లు చల్లేసింది.

అందరూ అనుకుంటున్నట్లుగా ‘బాబు బాగా బిజీ’లో తాను చేస్తున్నది అంత గ్లామర్ టచ్ ఉన్న పాత్ర కాదని శ్రీముఖి తెలిపింది. తాను ఇందులో హాట్ హాట్ సీన్లు చేసినట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. ఇందులో తాను చేసింది గౌరవప్రదమైన పాత్ర అని.. హీరోకు దిశానిర్దేశం చేసేలా తన పాత్ర ఉంటుందని శ్రీముఖి స్పష్టం చేసింది. ఐతే ‘బాబు బాగా బిజీ’ పోస్టర్లు చూస్తే మాత్రం అందులో హీరో అవసరాల శ్రీనివాస్.. శ్రీముఖిని ముగ్గులోకి దించుతున్నట్లుగా.. వాళ్లిద్దరి మధ్య ఇంటిమేంట్ సీన్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ‘బాబు బాగా బిజీ’ బాలీవుడ్ అడల్డ్ కామెడీ ‘హంటర్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అందులో హీరో హీరోయిన్ తో మినహా అందరితో రొమాన్స్ చేస్తాడు. తెలుగు వెర్షన్ హీరోయిన్ గా చేస్తున్నది శ్రీముఖి కాదు. మిస్త్రీ చక్రవర్తి. మరి శ్రీముఖి ఏ పాత్ర చేస్తోందో చూడాలి. ఆమె కోసం తన పాత్రనేమైనా మార్చారో ఏమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/