Begin typing your search above and press return to search.

కొత్త తెలుగు సినిమాకి బ్రూస్ లీ లింక్

By:  Tupaki Desk   |   19 Jun 2018 5:41 AM GMT
కొత్త తెలుగు సినిమాకి బ్రూస్ లీ లింక్
X
నాలుగేళ్ల క్రితం 'భూ' అంటూ ధన్ రాజ్.. జీవా.. సుప్రియలతో ఓ భయపెట్టే సినిమాను తనే నిర్మాతగా చేశాడు దర్శకుడు శ్రీ కిషోర్. గత పదేళ్లుగా హాంగ్ కాంగ్ లో డ్యాన్స్ ఇన్ స్ట్రక్టర్ గా ఉన్న ఈ తెలుగు వ్యక్తికి.. ఫిలిం మేకింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఇప్పుడు మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్ అంటూ మరో తెలుగు చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు.

తెలుగులో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా క్యాస్టింగ్ అండ్ క్రూ ను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అయితే.. ఈ ప్రాజెక్టుకు అనుకోకుండా చైనా నుంచి సూపర్ సపోర్ట్ వచ్చింది. చైనా ఎంటర్టెయిన్మెంట్ టెలివిజన్ ఫౌండర్ రాబర్ట్ చువా వహ్-పెంగ్ అనే మిలియనీర్.. ఈ మూవీని నిర్మించబోతున్నాడు. టీవీ ఫౌండర్ అన్నంత మాత్రాన చిన్న చూపు చూసేందుకు లేదు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దదే. ప్రపంచ సినిమా రంగంలోనే స్టంట్స్ తో సెన్సేషన్స్ సృష్టించిన బ్రూస్ లీ కి.. ఇతడు క్లోజ్ ఫ్రెండ్.

రాబర్ట్ చువా ఈ ప్రాజెక్టుని నిర్మించేందుకు అంగీకరించడం ఆనందంగా ఉందంటున్నాడు దర్శకుడు శ్రీ కిషోర్. బ్రూస్ లీ లాంటి దిగ్గజ ఫిలిం స్టార్ తో తన అనుభవాలను ఆయన పంచుకుంటుంటే.. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం దక్కుతోందని అంటున్నాడు. మై ఇండియన్ బాయ్ ఫ్రెండ్ కథ అందరినీ మెప్పించేదిగా ఉంటుందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా చేస్తున్నామని చెప్పిన ఈ దర్శకుడు.. ఆగస్టులో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళతామని అంటున్నాడు.