Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్: బాలయ్య పాత్రకు నాన్నగారు డబ్బింగ్

By:  Tupaki Desk   |   18 Nov 2018 7:52 AM GMT
ఎన్టీఆర్: బాలయ్య పాత్రకు నాన్నగారు డబ్బింగ్
X
లెజెండరీ యాక్టర్ కమ్ పోలిటిషియన్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో అయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తాజా గా బయటకు వచ్చింది. జెట్ స్పీట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు నిర్మాణానంతర క్రమాలు కోడా జోరుగా సాగుతున్నాయి.

ఈ సందర్బంలోనే దర్శకుడు క్రిష్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ తో బాలయ్య ముందుకు వచ్చాడట. బాలయ్య పోషిస్తున్న ఎన్టీఆర్ పాత్రకు ఒరిజినల్ వాయిసే వాడదామని చెప్పాడట. ఎలాగూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచుల ఆడియో దొరుకుతుంది కాబట్టి బాలయ్య వాయిస్ కాకుండా ఒరిజినల్ ఎన్టీఆర్ గాత్రాన్నే ఉపయోగిస్తే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని అన్నాడట. దీంతో బాలయ్య పాత్రకు ఏకంగా ఎన్టీఆరే వచ్చి డబ్బింగ్ చెప్పినట్టు ఉంటుంది.

ఇప్పటికే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యను చూస్తే అచ్చుగుద్దినట్టు నాన్నగారిలాగానే ఉన్నారు. ఇక వాయిస్ కూడా ఎన్టీఆర్ ది వాడితే ఇక ప్రేక్షకులు ఫ్లాట్ అయినట్టే. ఏదేమైనా క్రిష్ ఇలాంటి సరికొత్త ఐడియాలతో ఎన్టీఆర్ బయోపిక్ పై అసక్తి పెంచుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది.