Begin typing your search above and press return to search.

ప్రత్యేకం : ప్రేక్షకులారా !!! ఏది మరణం...

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:30 AM GMT
ప్రత్యేకం : ప్రేక్షకులారా !!! ఏది మరణం...
X
బాహుబలి సినిమా గ్రాఫిక్స్, సెట్టింగ్స్ విభాగంలలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే యుద్ధ సన్నివేశాల సమయంలో తన మహాసేనకి ప్రభాస్ చెప్పిన స్పూర్తిదాయక మాటలు సేననేకాదు.. ప్రేక్షకులని కూడా ఆకర్షించాయి. వీటిని దర్శకుడు కమ్ రచయిత దేవ కట్టా ప్రత్యేకంగా రాయడం విశేషం.. ఆ సంబాషణని ఒక మంచి పనికోసం సరదాగా స్పూఫ్ చేస్తే ఎలా వుంటుందో మీరే చదవండి...

తెలుగు ప్రేక్షకులారా!!!!!
ఏది మరణం...
మన టాలీవుడ్ కన్నా బాలీ, కోలీవుడ్ లు పెద్దవి అనుకోవడం మరణం..
బాహుబలి సినిమాను బ్లాక్ లో అమ్ముతున్నారని ఇంటికొచ్చి పైరసీ ప్రింట్ లో చూడడం మరణం..
మన తెలుగు సినిమా గొప్పతనాన్ని గుర్తించకుండా "సౌత్ సినిమాలన్నీ ఓవర్ యాక్షన్ సినిమాల"ని హేళన చేస్తుంటే.. వాళ్ళకి అర్ధమయ్యేలా బాహుబలి రికార్డు కలెక్షన్లకు మనం దోహదపడకపోవడం మరణం..
ఆ మరణాన్ని జయించడానికి మేము వెళ్తున్నాము..
మా బాహుబలిని, మా తెలుగు సినిమాను మరే సౌత్ మూవీ ముట్టుకోలేదని రోమ్ముచీల్చి గుండె ధైర్యంతో చెప్పడానికి మేము వెళ్తున్నాము..

మాతో పాటూ సినిమాకు వచ్చెదెవరు...
మాతొ పాటూ సినిమా కలెక్షన్లను పెంచేదెవరు..
గత రికార్డులను దాటి 500కోట్ల కోటలో బాహుబలిని మాతొ పాటూ నిలిపేదెవరు...
మీరు... మీరు... మీరే....
(ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని పైరసీలో చూడరని ఆశిస్తూ. . )