Begin typing your search above and press return to search.

మహేష్‌ టీజర్లో సాలీడు కూడా ఉందా?

By:  Tupaki Desk   |   21 Feb 2017 12:43 PM GMT
మహేష్‌ టీజర్లో సాలీడు కూడా ఉందా?
X
మహేష్‌ బాబు సినిమా టీజర్లో మహేష్‌ బాబు ఉంటాడు కాని.. ఈ సాలీడ్లు వంటి పురుగుల గోల ఏంటండీ బాబూ? అనుకుంటున్నారా.. అయితే ఇక్కడే ఒక కొత్త విషయం తెలుసుకోవాల్సిన టైమ్ వచ్చింది. ప్రస్తుతం మహేష్‌ చేస్తున్న ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ వినిపిస్తోంది. చూస్తోంటే ఈ సినిమా ఏదో సైన్స్ ఫిక్షన్‌ సినిమా అనే డౌటే వస్తోంది మరి.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో కొన్ని రోబోటిక్స్ కూడా వాడుతున్నారట. వాటిలో ముఖ్యంగా ఒక రోబో సాలిపురుగు ఒకటి ఉంటుంది. ప్రస్తుతం రిలీజ్ చేయనున్న టీజర్లోనే ఈ రోబో సాలీడును ప్రపంచానికి చూపించాలని మహేష్‌ డైరక్టర్ మురుగుదాస్ ఫిక్సయ్యారని టాక్. అందుకే ఇప్పుడు లండన్ లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వారితో ఈ సాలీడు తాలూకు కంప్యూటర్ గ్రాఫిక్స్ 35 లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తున్నారట. ఒకవేళ ఈ సినిమాలో మహేష్‌ ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు కాబట్టి.. జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ఈ సాలీడు మనోడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుందేమో.

ఏదేమైనా కూడా సడన్ గా ఈ గ్రాఫిక్స్ తాలూకు న్యూస్ తో మహేష్‌ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. ఈ సినిమాకు ''సంభవామి యుగే యుగే'' అనే టైటిల్ ను పెట్టినట్లు మొన్న నిర్మాత పివిపి ఇన్ డైరెక్టుగా కన్ఫామ్ చేయగా.. అబ్బే అది మా టైటిల్ కాదంటూ సదరు సినిమా పి.ఆర్.ఓ ఇప్పుడు మీడియా వారికి ఎసెమ్మెస్ లు పెడుతున్నాడు. ఇది మరో ట్విస్టులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/