సైమాలో ఈసారి సెన్సేషనల్ స్టెప్

Fri Apr 21 2017 19:19:08 GMT+0530 (IST)


ఏటేటా సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం దక్షిణాది సినీ పరిశ్రమలను ఏకం చేస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుక.. ఇప్పటికి ఐదు సార్లు జరగగా అన్ని సార్లూ సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇప్పుడు ఆరోసారి సైమా అవార్డులకు రంగం సిద్ధం అవుతుండగా.. ఈసారి సెన్సేషనల్ స్టెప్ తీసుకున్నారు నిర్వాహకులు. తొలిసారిగా షార్ట్ ఫిలిమ్స్ కు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి సైమా వర్గాలు. సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ పేరుతో.. వీటిని ప్రదానం చేయనుండగా.. మొత్తం 8 కేటగిరీల్లో వీటిని అందించబోతున్నారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ఈ షార్ట్ ఫిలిమ్ అవార్డులు ఇవ్వనుండడమే కాకుండా.. షార్ట్ ఫిలిం మేకర్స్ కు ఓ అద్భుతమైన అవకాశం కూడా లభించనుంది.

సైమా ఈవెంట్ లో ఫీచర్ ఫిలిమ్స్ తో ఇంటరాక్ట్ అయ్యి.. తమ నైపుణ్యాలను.. ప్రాజెక్టులను.. ట్యాలెంట్స్ ను వివరించే అవకాశం షార్ట్ ఫిలిం మేకర్స్ కు దక్కనుంది. విన్నర్లకు అవార్డుల కంటే ఇదే అతి పెద్ద అఛీవ్మెంట్ కానుంది. షార్ట్ ఫిలిం కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ ట్రెండ్ సెట్టర్స్ గా మారడం ఖాయమని చెప్పచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/