సౌత్ హీరోల అవెంజర్స్ భలే ఉందే

Mon Apr 16 2018 12:48:52 GMT+0530 (IST)

హాలీవుడ్ తో పాటు ప్రపంచ సినిమా ప్రేమికులంతా ఎదురు చూస్తున్న అవెంజర్స్ ఏప్రిల్ 27 భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే. సూపర్ హీరోలందరూ ఒకే సినిమాలో చేసే భీభత్సం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ట్రైలర్ ని కొందరు చాలా క్రియేటివ్ గా మన సౌత్ హీరోలందరిని అందులో మిక్స్ చేసి తయారు చేసిన వీడియో ఒకటి ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. నివిన్ పౌలి లాంటి అప్ కమింగ్ మలయాళం హీరోతో మొదలుకుని చిరంజీవి రజనీకాంత్ దాకా ఎవరిని వదలకుండా అందరిని అందులో చూపించేసారు. ఒరిజినల్ ఆడియో ని మార్చకుండా అది అలాగే ఉంచేసి కేవలం వీడియో ని మాత్రం ఎడిట్ చేసిన తీరు  సూపర్ అనకుండా ఉండటం కష్టమే. అంతలా దీన్ని కట్ చేసారు.ఇది చేసిన వ్యక్తి పేరు శామిల్ రెహమాన్. చెన్నై వ్యక్తి. అందుకే తమిళ హీరోల హవా ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. విజయ్ సేతుపతితో మొదలుపెట్టి అల్లు అర్జున్-విజయ్-జయం రవి-రామ్ చరణ్-చిరంజీవి-పవన్ కళ్యాణ్ – ప్రభాస్- శివ కార్తికేయన్- సూర్య-కార్తి- విజయ్ – విక్రం – మమ్మ్ముట్టి – మోహన్ లాల్  ఇలా అందరిని ఇందులో వాడేసుకున్నాడు. తమిళ వ్యక్తి కాబట్టి బాలయ్య నాగ్ వెంకటేష్ లాంటి హీరోలను మిస్ చేసాడు. దానికి కారణం రెండు నిమిషాల ట్రైలర్ లో ఛాన్స్ దొరకలేదు అనే చెప్పాలి. ఇప్పటికే లక్ష వ్యూస్ కు దగ్గరలో ఈ సౌత్ ఇండియన్ అవెంజర్స్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మీరూ ఒక లుక్ వేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి