అందమైన భామలే రాకాసులు

Fri Sep 22 2017 10:27:24 GMT+0530 (IST)

మన కథానాయికలు అందంగా కనిపించడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ.. వారి ప్రతిభను కనబరుస్తున్నారు. ముఖ్యంగా హర్రర్ తరహా పాత్రలను చాలా ఇష్టంగా చేస్తున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. ఎంత చిన్న హీరోయిన్స్ అయినా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఒక్కసారైనా దెయ్యంలా కనిపించాలని అనుకుంటున్నారు.మొదట చంద్రముఖి సినిమాలో జ్యోతిక భయపెడితే.. తరువాత త్రిషా - ఛార్మి  - నయనతార వంటి హీరోయిన్స్ వారి స్థాయిలో భయపెట్టారు. ముఖ్యంగా నందిత "ప్రేమ కథ చిత్రమ్" సినిమాతో మరో ట్రెండ్ ని స్టార్ట్ చేసిందని చెప్పాలి. ఇక మరో తెలుగమ్మాయి అంజలి భామ కూడా "గీతాంజలి" అంటూ ప్రేక్షకులకు థ్రిల్ ని ఇచ్చింది. అదే తరహాలో యాపిల్ బ్యూటీ హన్సికా అయితే చంద్రకళ సినిమాతో నట విశ్వరూపాన్ని చూపించింది. రీసెంట్ గా సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కూడా నవ్వుతూనే భయాన్ని కొత్తగా చూపించింది.

ఒకప్పుడు దెయ్యాల సినిమాలో పాత్రలు ప్రేక్షకుల భావనకు తగ్గటు ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో అందమైన ముద్దుగుమ్మలు కూడా రాకాసుల్లా తయారవుతూ.. ఎవరి స్టైల్ లో వారు వెండి తెరపై కేకలు పెట్టిస్తున్నారు. అందం వెనుక ఇంత భయం ఉందా అనేలా వారి నటనను చూపించారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా రాజుగారి గది 2 తో త్వరలో తన అందంతో భయపెట్టడానికి రాబోతోంది. మరి అమ్మడు ఎంతవరకు బయపెడుతుందో చూడాలి.