ఈ టైంలో హనీమూన్ పిక్స్ ఏంటీ మేడమ్?

Sat Feb 16 2019 18:43:50 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవలే విషాగన్ ను రెండవ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. తమిళ సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి అయిన తర్వాత ఈ కొత్త జంట ఐస్ ల్యాండ్ కు హనీమూన్ కోసం అని వెళ్లింది. అక్కడ సౌందర్య మరియు విషాగన్ లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సౌందర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇటీవల ఉగ్రదాడి జరిగి 40 మంది జవాన్ లు మరణించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విషాద చాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎవరిని చూసినా కూడా జవాన్ లకు సలాం కొడుతూ శ్రద్దాంజలి ఘటిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. దాదాపు సెలబ్రెటీలు అంతా కూడా ఈ టైంలో వీర జవాన్ లకు శ్రద్దాంజలి ఘటిస్తూ ఉన్నారు.సోషల్ మీడియాలో వీర జవాన్ లకు సలాం చేస్తున్న ఇటువంటి సమయంలో సౌందర్య మాత్రం తన హనీమూన్ పిక్స్ ను పోస్ట్ చేయడం జరిగింది. దాంతో ఆమెపై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో మీరు హనీమూన్ చేసుకోవడం అది మీ వ్యక్తిగతం కాని ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఏంటీ మీ మైండ్ ఏమైనా చెడిందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

2016లో అశ్విన్ తో విడాకులు తీసుకున్న సౌందర్య గత కొన్ని రోజులుగా విషాగన్ తో సన్నిహిత్యంగా ఉంటూ వచ్చింది. విషాగన్ కూడా రెండవ పెళ్లి వ్యక్తి దాంతో ఇద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పెళ్లి జరగడం అంతా హ్యాపీగా జరిగింది. అయితే తాజాగా సౌందర్య చేసిన ట్వీట్స్ మాత్రం వివాదాన్ని సృష్టించాయి.