Begin typing your search above and press return to search.

మూడు క్రేజీ సినిమాలు.. ఒకేచోట‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 5:30 AM GMT
మూడు క్రేజీ సినిమాలు.. ఒకేచోట‌
X
వెబ్ ప్ర‌పంచంలో అస‌లు దొర‌క‌ని స‌మాచార‌మే లేదు. సెల‌బ్రిటీల న్యూస్ పిన్ టు పిన్ తెలిసిపోతోందిక్క‌డ‌. ఫ‌లానా హీరో సినిమా షూటింగ్ ఎక్క‌డ‌? లొకేష‌న్ ఏది? ఏ స‌న్నివేశం షూట్ చేస్తున్నారు? ఈ రేంజులో డీప్ అప్‌ డేట్స్ ఇట్టే తెలిసిపోతున్నాయిక్క‌డ‌. అందుకే త‌మ అభిమాన హీరో నుంచి వ‌చ్చే ప్ర‌తి అప్‌ డేట్ కోసం ఫ్యాన్స్ చ‌కోర‌ప‌క్షుల్లా ఎదురు చూస్తుంటారు. అలాంటిదే ఈ ఇన్‌ ఫ‌ర్మేష‌న్‌...

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో ఓ మూడు సినిమాల షూటింగులు ఒకే లొకేష‌న్‌ లో జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ నాన‌క్‌ రామ్‌ గూడ రామానాయుడు విలేజ్ షూటింగుల‌కు ప్ర‌సిద్ధి. ప్రశాంత మైన వాతావ‌ర‌ణం ఉంటుందిక్క‌డ‌. అందుకే నిరంత‌రం ఇక్క‌డ ఏదో ఒక సినిమా షూటింగ్ సాగుతూనే ఉంటుంది. ఇప్ప‌టికిప్పుడు బాల‌య్య‌బాబు హీరోగా న‌టిస్తున్న డిక్టేట‌ర్ షూటింగ్ నాన‌క్‌ రామ్‌ గూడ‌లో జ‌రుగుతోంది. లౌక్యం ఫేం శ్రీ‌వాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే బ‌న్ని హీరోగా న‌టిస్తున్న స‌రైనోడు షూటింగ్ కూడా నాన‌క్‌ రామ్‌ గూడ రామానాయుడు విలేజ్‌ లోనే జ‌రుగుతోంది. ఈ సినిమాకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సేమ్ ప్లేస్‌ లో ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ హీరోగా న‌టిస్తున్న సౌఖ్యం మూవీ షూటింగ్ కూడా సాగుతోంది. ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యాధృచ్ఛిక‌మే అయినా బాల‌య్య‌ - బ‌న్ని - గోపీ ఒకేచోట షూటింగులు చేసుకోవ‌డం విశేషం.

బాల‌య్య డిక్టేట‌ర్ 2016 సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతోంది. బ‌న్ని న‌టిస్తున్న స‌రైనోడు అత‌డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న రిలీజ‌వుతుంద‌ని స‌మాచారం. అలాగే గోపిచంద్ సౌఖ్యం డిసెంబ‌ర్‌ లో క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ‌వుతోంది. అదీ అప్‌ డేట్‌.