Begin typing your search above and press return to search.

లండన్ పిల్ల.. టి పెడుతోంది

By:  Tupaki Desk   |   24 Nov 2017 6:22 AM GMT
లండన్ పిల్ల.. టి పెడుతోంది
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ తన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎంతో ఆలోచన విధానంతో కథను రాసుకునే ఈ దర్శకుడు ఎలాంటి సినిమాను తీసినా సినిమాలో ఒక్కటి మాత్రం రెగ్యులర్ గా ఉండేట్లు చూసుకుంటాడు. అదే ఐటెమ్ సాంగ్. తన ప్రతి సినిమాలో థిన్ మార్ తరహాలో ఊపు మీద ఉండే ఒక సాంగ్ ఉండాల్సిందే..

అయితే ఆ సాంగ్స్ లో సుక్కు ప్రతి సారి హాట్ డ్యాన్సర్లతో సాంగ్ ని చేయించేవాడు. అదే తరహాలో మహేష్ బాబుతో తెరకెక్కించిన వన్ నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు అంటూ చిందులు వేసిన బ్యూటీ సోఫి చౌదరి. బ్రిటీష్‌ కు చెందిన ఈ ఇండియన్ సంతతి సుందరి సింగర్ కూడా. అయితే బాలీవుడ్ లో చాలా సినిమాలని చేసిన ఈ హాట్ మోడల్ చివరగా నేనొక్కడినే సినిమాలోనే కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

అమ్మడికి ట్విట్టర్ లో ఫాలోవర్స్ చాలమాందే ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లొనే సోఫియా కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేయడం లేదట. అయితే రీసెంట్ గా ఒక ఫిట్ నెస్ టీ కి ప్రచారం కల్పిస్తూ ప్రత్యక్షం అయ్యింది. తన సొంత ఫిట్ నెస్ టీ అంటూ..ఎనర్జీకి చాలా మంచిదని.. 30 రోజుల్లో వెయిట్ కూడా లాస్ అవుతారు అంటూ.. పూర్తిగా ఆయుర్వేదిక్ అంటూ సందేశాన్ని ఇచ్చింది. అమ్మడికి అవకాశాలు లేకపోయినా బిజినెస్ లు బాగానే చేస్తోంది. ఆమె టి పెడుతోంది.. మరి తాగడానికి మీరు రెడీనా?