ఫోటో స్టొరీ: సోఫీ చౌదరి కాదు.. సోహాట్ చౌదరి

Sat Jun 15 2019 20:00:01 GMT+0530 (IST)

ఈ ప్రపంచంలో అందం అనేది ఎప్పుడూ ఉంటుంది.. ఆడమ్ ఈవ్ కాలం నుండి ఇప్పటి వరకూ ఉంది. కానీ ఎప్పుడూ మన జనాల్లో మెజారిటీ శాతం సైతాన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడంతో వారికి అందం కనపడదు.  పేపర్ ఓపెన్ చేసి రేపులు.. హత్యల న్యూస్ ఎక్కడ ఉందో వెతుక్కుని మరీ చదువుతూ ఉంటే దాన్ని సైతాన్ పై ఫోకస్ చేయడం అని కాకుండా  ఏమంటారు? అయితే కొందరికి స్వతహాగా కళాపోషణ ఉంటుంది వారు మాత్రం డైరెక్ట్ గా అందాల భామలు ఎక్కడున్నారు.. గ్లామర్ ఎక్కడుందో అక్కడే ఫోకస్ పెడతారు.  న్యూస్ పేపర్ అనే కాదు..రోడ్ మీద నడుస్తున్నా వారి కళ్ళలో ఉండే హై ఎండ్ స్కానర్లు అందాల కోసం గాలిస్తూ ఉంటాయి!  సరిగ్గా ఇలాంటి కళాత్మక హృదయులు.. సున్నిత మనస్కుల కోసమే సోఫీ చౌదరి లాంటి భామలు ఈ భూలోకంలో ఉన్నారు.ఆమె ఎవరు అంటే.. ఇండియన్ కాదు.  ఇంగ్లాండ్ భామ.  బాలీవుడ్ హాటు నటీమణులలో పేరెన్నికగన్న ఘాటు అందం. మొదట్లో ఎంటీవీ వీజే గా పనిచేసింది.  ఝలక్ దిఖ్లాజా 7 లో పార్టిసిపెంట్.  కత్తి లాంటి డ్యాన్సర్.. కిరాక్ సింగర్.  అంతే కాదు పాప కు ఎన్ని భాషలు వచ్చో తెలిస్తే మనకు మాజీ ప్రధాని పీవీ గుర్తొచ్చే అవకాశం ఉంది.  ఇంగ్లీష్.. హిందీ.. ఉర్దూ.. ఫ్రెంచ్.. ఇటాలియన్ భాషల్లో ఇరగదీస్తుందట. ఇవి కాకుండా పంజాబీ.. స్పానిష్.. అరబిక్ భాషల్లో ప్రవేశం ఉందట.  ఈ ఏడెనిమిది భాషల్లో అవలీలగా పాటలు పాడుతుందట!  ఇక బాలీవుడ్ లో కనీసం ఒక డజన్ సినిమాల్లో నటించింది. '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది.  భాషలు.. పాటలు.. డ్యాన్సులు కాకుండా సోషల్ మీడియాలో హీటు పెంచడంలో పీహెచ్ డీ పట్టా కూడా ఉంది!

తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది సోఫీ. ప్రింటెడ్ కలర్స్ ఉన్న బికినీ.. దానికి తోడుగా ఒక కేప్ ధరించి బీచ్ ఒడ్డున ఒక పిల్లర్ కు ఆనుకుని నిలబడింది.  ఈ ఫోటోకు "మీకు నీడలు లేవు అంటే మీరు వెలుగులో లేనట్టే లెక్క" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  క్యాప్షన్ కు మ్యాచ్ అయ్యేలా ఆమె మొహం పై కొంచెం నీడ ఉంది. అసలే ఎర్రగా బుర్రగా ఉండే భామ.. బికినీ వేసుకోవడంతో ఈ ఫోటో ఒక అందాల ఎగ్జిబిషన్ లా కనిపిస్తోంది. ఈ ఫోటో తీసుకున్న లొకేషన్ నలదు ఐలాండ్ రిసార్ట్..మాల్దీవ్స్.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. "సోఫీ చౌదరి కాదు.. సోహాట్ చౌదరి". "ఆసమ్ బికినీ.. హాట్ బ్యూటీ".. "స్ప్లెండిడ్ క్లిక్ సోఫీ".. "డామ్ హాట్ గర్ల్ ఇన్ బీ టౌన్" అంటూ పొగడ్తలు కురిపించారు. బాలీవుడ్ లోని మరో సీనియర్ హాటీ మలైకా అరోరా ఈ ఫోటోకు లైక్ కొట్టింది.