ట్రైలర్ టాక్: తాప్సీ హాకీ మూవి అదిరిందే

Mon Jun 11 2018 22:53:52 GMT+0530 (IST)

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు బయోపిక్ అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రముఖుల నిజ జీవితాల గురించి తెరపై చూపించడానికి మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపోతే హాకీ ప్లేయర్ లెజెండ్ సందీప్ సింగ్ బయోపిక్ కూడా ఇటీవల తెరకెక్కింది. సూర్మ పేరుతో షాద్ అలీ దర్శకత్వం వహించిన సినిమా మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.సందీప్ సింగ్ పాత్రలో దిల్జీత్ దోసంజ్ నటిస్తున్నారు. ఇక కథానాయికగా తాప్సి నటించింది. కొన్ని గంటల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హాకీ లెజెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ సింగ్ జీవితం ఎన్నో మలుపులతో కూడుకున్నది. భారత [జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘటనలను చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. గన్ షాట్ కి గురైన తరువాత వీల్ చెయిర్ పైనే ఉండగా అందరూ మర్చిపోవడం.. అయినా కూడా కష్టపడి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రపంచానికి ఆత్మవిశ్వాసం అనే నిర్వచనాన్ని చూపించాడు సందీప్.

ఆ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయని అర్ధమవుతోంది భావోద్వేగంతో కూడుకున్న ఈ కథను కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక తాప్సి కి ఇది ఒక మంచి అవకాశం. హిట్ అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే. ఇక జూలై 13న సూర్మ రిలీజ్ కానుంది.