అనుభవిస్తున్న అరుంధతి విలన్!!

Wed Sep 13 2017 21:11:48 GMT+0530 (IST)

సోనూ సూద్ అనగానే అరుంధతి మూవీలో పశుపతి పాత్ర గుర్తుకు వచ్చేయడంలో ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత కూడా చాలానే సినిమాల్లో కనిపించినా.. పశుపతి పాత్ర ప్రభావం మామూలుగా లేదు. సోనూసూద్ ను స్టార్ చేసేసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా ఇప్పుడు అనేక భాషల్లో ఫుల్ బిజీ ఆర్టిస్టుల్లో సోనూ సూద్ ఒకడు.మరి అలాంటి స్టార్ యాక్టర్ కి అన్ని సౌకర్యాలు అమరడంలో ఆశ్చర్యం ఏమీ ఉండదు. అయితే.. ఇవన్నీ ఓ స్థాయి వరకే అనుకుంటాం. కానీ సోనూ సూద్ రీసెంట్ గా షేర్ చేసిన ఓ ఫోటో చూస్తే.. మైండ్ బ్లాంక్ అవాల్సిందే. ఓ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో తాను ప్రయాణిస్తున్న  ఫోటోను షేర్ చేశాడు సోనూ సూద్. కాళ్లారచాపుకుని.. రిక్లైనర్ చైర్ లో సోనూసూద్ కూర్చుని ఉంటే.. ఎదురుగా టీవీలో నచ్చిన ప్రోగ్రామ్ చూస్తుంటాడు. అలాగే  చేతిలో ఉన్న ఫోన్ ను ఆపరేట్ చేస్తుడడం చూస్తే.. ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉందని అర్ధమవుతుంది. ఇలా ఫ్లైట్స్ లో కూడా ఇంటర్నెట్ ఇచ్చే సౌకర్యాన్ని ఈ మధ్యనే ఎతిహాద్ ఎయిర్వేస్ వంటి ఎయిర్ లైన్స్ కంపెనీలు ప్రారంభించాయి.

కాకపోతే ఇలాంటి సౌకర్యాలు బాగా కాస్ట్ లీ. ఇంత లగ్జరీగా జర్నీ చేస్తూ.. 'గమ్యం ఓ  ఎండమావి లాంటిది' అంటూ వేదాంతం టైపులో మాట్లాడుతున్నాడంటే.. ఇలాంటి సౌకర్యాలన్నీ సోనూసూద్ కు ఏ రేంజ్ లో అలవాటు అయిపోయాయో అర్ధమవుతుంది. అనుభవించు రాజా స్కీం ఇదే కదూ.