Begin typing your search above and press return to search.

వీడియో రికార్డ్ చేసి చూపించాడుగా..

By:  Tupaki Desk   |   24 April 2017 6:33 AM GMT
వీడియో రికార్డ్ చేసి చూపించాడుగా..
X
తెల్లవారుఝామున మసీదు నుంచి వినిపించే అజాన్ పై వ్యాఖ్యలు చేసి సింగర్ సోనూ నిగమ్ వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. దీన్ని ఓ గూండాగిరీ అనేయడంతో పెద్ద వివాదమే చెలరేగింది. తాను అన్న మాటలు ముస్లింలకు వ్యతిరేకం అయితేనే సారీ చెబ్తానన్న సోనూ.. తాజా ట్వీట్ తో మళ్లీ వార్తల్లో నిలిచాడు.

అసలు సోనూ నిగమ్ ఇంటికి అజాన్ వినిపించదంటూ చాలామంది అన్నారు. దీంతో ఈ విషయాన్ని నిరూపించేందుకు అన్నట్లుగా.. చీకటిలోనే మసీదు నుంచి అజాన్ వినిపించేలా ఓ వీడియోను రికార్డ్ చేశాడు సోను నిగమ్. తెల్లవారుజామున తన ఇంటిలోనుంచే తీసిన ఈ వీడియోను నెట్ లో పోస్ట్ చేసిన ఈ సింగర్.. గుడ్ మాణింగ్ ఇండియా అంటూ ట్వీట్ పెట్టాడు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని వస్తున్న ఆరోపణలకు సమాధానంగానే ఈ వీడియోను పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోనూ నిగమ్ గుండుతో దర్శనం ఇస్తున్నాడు.

అజాన్ పై కామెంట్స్ చేసిన తర్వాత.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మత పెద్ద.. సోనూ నిగమ్ కు గుండు చేసిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ ఫత్వా జారీ చేశారు. దీనికి రియాక్ట్ అయిన సోనూ.. తనే గుండు చేయించుకుని మీడియా ముందుకు రావడం విశేషం. మొదట ఎవరూ కామెంట్స్ చేయకపోయినా.. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి సోనూకు సపోర్ట్ లభిస్తుండడం విశేషం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/