Begin typing your search above and press return to search.

మంచు హీరోయిన్‌.. హాట్ స్పెషాలిటీ

By:  Tupaki Desk   |   26 May 2016 5:45 AM GMT
మంచు హీరోయిన్‌.. హాట్ స్పెషాలిటీ
X
మంచు విష్ణుతో వరుసగా రెండు సినిమాలు చేసిన సోనారికా భడోరియా.. అసలు టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టింది. అమ్మడు నటించిన మొదటి సీరియల్ 'తుమ్ దేనా సాథ్ మేరా' క్లిక్ కాకపోయినా.. ఈమె అందానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఆ వెంటనే.. 'దేవోం కీ దేవ్.. మహాదేవ్' సీరియల్ లో పార్వతీ దేవిగా నటించే ఆఫర్ వచ్చింది. ఈ రోల్ తో పాటు, సీరియల్ బాగా క్లిక్ అవడంతో.. సోనారిక సెటిల్ అయిపోయింది.

ఈ సీరియల్ ఎఫెక్ట్ తో సోనారికా భడోరియాకు అన్నీ శారీ టైపు పాత్రలే వచ్చాయి. అలాంటివాటితో పాటు కొన్ని గ్లామర్ రోల్స్ కూడా చేస్తోందీమె. మహాదేవ్ సీరియల్ లో పట్టుచీర - కట్టుబొట్టుతో అంత సాంప్రదాయంగా కనిపించే సోనారిక.. రియల్ లైఫ్ లో మాత్రం బాగా హాట్ గా కనిపించడానికే ఇష్టపడుతుంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ సుందరాంగి.. బీచ్ లలో షికార్లు కొడుతోంది.

తన ఒంపు సొంపులను ఫోటోలు తీసుకుని, తీయించుకుని.. వాటిని ఆన్ లైన్ లో పెట్టేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదు సోనారిక. ఈ భామను ఇంత హాట్ గా చూసేసరికి జనాలకు మతి పోతోంది. ఏమైనా అటు పద్ధతైన పాత్రలకు, ఇటు బికినీవేర్ కు తగినట్లుగా బాడీ షేపులు ఉండడం.. సోనారిక స్పెషాలిటీ కదూ.