Begin typing your search above and press return to search.

పార్వతీ దేవి అరెస్టు చేయించింది!!

By:  Tupaki Desk   |   29 April 2017 11:37 AM GMT
పార్వతీ దేవి అరెస్టు చేయించింది!!
X
ఇప్పుడు హీరోయిన్లకు చాలా వైపుల నుండి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ఒక అభిమాని ఈ మధ్యనే ఇషా గుప్తాను దుబాయ్ లో ఏకంగా బాత్రూమ్ వరకు వెంటాడు.. ఒక సెల్ఫీ కోసం. అలాగే ఓ సంవత్సరం ముందు తూనీగ తూనీగ ఫేం రియా చక్రవర్తి వాళ్ల అపార్టుమెంటు లిఫ్టులో ఒక అభిమాని అసభ్యకరంగా తాకరాని చోటన తాకాడు. అలాగే శృతి హాసన్ ను ఒక ఆగంతకుడు పీక నొక్కేయబోయాడు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇటువంటి పరిస్థితి రాబోయేదేమో కాని.. ఆమె కాస్త ముందుగానే స్పందించింది.

టివి సీరియల్ లో పార్వతీ దేవ పాత్రను చేసి బాగా పాపులర్ అయిన సోనారికా బడోరియా ఉంది చూశారూ.. తెలుగులో కూడా స్పీడున్నోడు.. జాదూగాడు.. ఈడోరకం ఆడోరకం వంటి సినిమాల్లో నటించింది. అయితే పార్వతిగా చేసిన ఈమె ఆ మధ్యన బికినీలో ఒక సెల్ఫీ షేర్ చేస్తే పెద్ద రచ్చే అయ్యింది. ఇకపోతే ఒక సంవత్సరం క్రితం నుండి ఒక ఆగంతకుడు ఈమె మొబైల్ కు ఆసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ.. అతడి ఫోటోలు పంపిస్తూ హరాస్ చేస్తున్నాడట. మొన్న ఫిబ్రవరిలో ఈ యవ్వారంపై సోనారిక కంప్లయింట్ ఇవ్వడంతో.. కాల్ డేటా అధారంగా ట్రేస్ చేసి ఒక 23 ఏళ్ల స్టూడెంట్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పుడు సోనారిక కాస్త ఊపిరి పిల్చుకుంటోందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/