Begin typing your search above and press return to search.

సన్నబడ్డ సన్నజాజికి ఆఫర్స్ వస్తాయా?

By:  Tupaki Desk   |   24 Jun 2017 1:37 PM GMT
సన్నబడ్డ సన్నజాజికి ఆఫర్స్ వస్తాయా?
X
టెలివిజన్ బ్యూటీ సోనారికా భడోరియా.. టాలీవుడ్ జనాలకు హీరోయిన్ గా ఇంకా ఎక్కువగా తెలుసు. దేవోం కే దేవ్ మహాదేవ్' సీరియల్ లో పార్వతీ దేవిగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ బ్యూటీ.. జాదూగాడు.. స్పీడున్నోడు.. ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే.. ఈ సినిమాల్లో అయినా.. ఆ సీరియల్ లో అయినా సోనారిక బొద్దుగానే కనిపిస్తుంది.

యాక్టింగ్ ట్యాలెంట్ ఎంత గొప్పగా ఉన్నా.. పర్సనాలిటీ కారణంగా ఈమెకు అనుకున్నన్ని ఆఫర్స్ అయితే రాలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన సోనారికా భడోరియా.. తన ఫిగర్ పై ఫుల్లుగా కాన్సంట్రేట్ చేసి.. తెగ చిక్కిపోయింది. తాజాగా తన సోషల్ మీడియా పేజ్ లో ఈ భామ షేర్ చేసిన ఫోటో చూసి అందరూ షాక్ తినేశారు కూడా. బక్కచిక్కిన నడుముతో.. దాదాపుగా జీరో సైజ్ చూపించేసింది సోనారిక. వైట్ డ్రెస్ లో తన అందాల ఫిగర్ ను వయ్యారంగా చూపించేసింది.

ప్రస్తుతం ఈ వయ్యారి నటించడం మొదలుపెట్టిన తెలుగు సినిమా 'సరదా'కు చిన్నపాటి బ్రేక్ పడగా.. తమిళ్ లో ఇంద్రజిత్ అనే మూవీలో నటిస్తోంది. ఇవి రెండూ అమ్మడు బొద్దుగా ఉన్నపుడే వచ్చిన ఆఫర్స్ కాగా.. ఇప్పుడు ఈ సన్నబడ్డ సన్నజాజికి ఎన్నెన్ని ఆఫర్స్ వస్తాయో.. టాలీవుడ్ నుంచి ఎన్ని పిలుపులు అందుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/