ప్రమోషన్స్ తో పిచ్చెక్కించారుగా..

Thu May 24 2018 22:16:20 GMT+0530 (IST)

ప్రస్తుత రోజుల్లో ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ ఉండాల్సిందే అనేట్టుగా నడుస్తోంది. నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కొంత డబ్బు వెనకేసుకుంటున్నారు అంటే ఆ వాల్యూ ఎలా ఉందొ చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా మంది హీరోలు వారికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తుంటే హీరోయిన్స్ మాత్రం ఊహించని రీతిలో ప్రమోషన్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఈ స్థాయిలో ఎవరైనా ప్రమోషన్స్ చేస్తారా అన్నట్టుగా కొంత మంది భామలు నిరూపిస్తున్నారు.రీసెంట్ గా బాలీవుడ్ లోని ఓ నాలుగురు హీరోయిన్స్ కూడా అందరికి షాకిచ్చారనే చెప్పాలి. ప్రమోషన్స్ కోసం కలలో కూడా ఊహించని విధంగా వారు వచ్చిన తీరు వర్ణనాతీతం. కరీనా కపూర్ ఖాన్ - సోనమ్ కపూర్  అహూజా - స్వర భాస్కర్ మరియు సాక్షి తల్సేనియాలు అందాల ఆరబోతతో పిచ్చెక్కించారు. వీరు నలుగురు వీరే ధీ వెడ్డింగ్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. నాలుగురు స్నేహితుల మధ్య ఆ సినిమా కథ సాగుతుంటుంది. అయితే సినిమాపై బజ్ తక్కువైంది అనుకున్నారో ఏమో గాని ప్రమోషన్స్ లలో హాట్ ఎంట్రీ ఇచ్చి కెమెరామెన్ లు స్టన్ అయ్యేలా చేశారు.

ముఖ్యంగా కరీనా కపూర్ బ్లాక్ డ్రెస్ లో హాట్ గా కనిపించి ముగ్గురికి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. పెళ్లయినా కుడా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెప్పింది. సోనమ్ కపూర్ కూడా వెరైటీ డ్రెస్ లో లెగ్స్ అందాలతో హీటెక్కించింది. స్వర భాస్కర్ అయితే కను రెప్ప వేయనివ్వకుండా చిన్న గౌనులో తెగ ఊరించింది. తానేమీ తక్కువ కాదు అన్నట్టు బ్లాక్ డ్రెస్ లో సెక్సీ గా కనిపించింది  సాక్షి తల్సేనియా. ఎవరికీ వారు గ్లామర్ తో సినిమాకు ఒక్కరోజులోనే క్రేజ్ తెచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోటోలను చూస్తేనే తెలుస్తోంది. ఇక జూన్ 1 రిలీజ్ కాబోయే ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.