Begin typing your search above and press return to search.

కామెంట్: సోనమ్ కళ్లు తెరిపించేసింది

By:  Tupaki Desk   |   29 Sep 2016 5:30 PM GMT
కామెంట్: సోనమ్ కళ్లు తెరిపించేసింది
X
గ్లామర్ ఇండస్ట్రీ అంతా అందాల తారల చుట్టూ తిరిగేస్తూ ఉంటుంది కానీ.. వీరిలో నిజంగా అంత అందంగా ఉండేవాళ్లు ఎవరూ ఉండరనే విషయం చాలామందికి తెలియదు. అంతా కెమేరా మాయ.. మేకప్ మహిమ తప్ప అంత బ్యూటీనెస్ వాస్తవంగా ఉండదు. అయితే.. ఈ విషయాన్ని చాలా తక్కువ మందే యాక్సెప్ట్ చేయగలరు. కానీ ఇలా ఒప్పుకోవడమే కాదు.. తన అందం వెనక ఉన్న గుట్టుని.. అలా తయారవ్వలన్న కసిని రగిల్చిన కారణాలను స్వయంగా చెప్పేసింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.

తను ఎందుకు అందంగా లేనని చిన్నప్పటి నుంచీ తెగ బాధపడేదిట సోనమ్. ముఖ్యంగా నల్లటి శరీరం.. కంటి కింద నల్లటి చారలు.. ఒంటి మీద మచ్చలు.. బాహువుల్లో బ్లాక్ టోన్ .. షేప్ లేని తొడలు.. కేవలం సి-కప్ సైజ్ ఉన్న బ్రెస్ట్.. మొదలైన కొన్నాల్టికే వీటన్నిటినీ చూసుకుని ఆమె కూడా చాలా బాధపడేదట. ఇంత నల్లగా.. ఇంత పొడుగ్గా అని ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ చేసిన కామెంట్ ఎప్పటికి మర్చిపోలేనని అంటోంది సోనమ్.

కొవ్వు కరిగించి కష్టపడి.. కడుపు మాడ్చుకుని ఎసిడిటీ సమస్యను కొనితెచ్చుకుని.. ఒళ్ళు తగ్గించి.. మరీ ఇప్పుడున్న షేపుల్లోకి మారినట్లు చెప్పిన సోనమ్.. తను ఏ పబ్లిక్ ఈవెంట్ కి హాజరయ్యే ముందైనా.. 90 నిమిషాలు ఈమెను ముగ్గురు నుంచి ఆరుగురు (హెయిర్ - మేకప్ - కాస్ట్యూమ్స్) రెడీ చేస్తే ఇలా కనిపిస్తోందట. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. అసలు అందం అనేది ఇలా తయారైతే వచ్చేది కాదని.. గ్లామర్ కోసం ఇదంతా చేయడం సరికాదని చెప్పడానికే ఇలా వివరిస్తున్నానంటోంది సోనమ్ కపూర్.

మన దేశంలోనే కాదు ఎక్కడైనా.. మహిళల శరీరాలను వర్ణించడం.. లోపాలను వెతకడం జరుగుతూనే ఉంటుందన్న సోనమ్.. అనుష్స శర్మ స్కిన్ ను.. సోనాక్షి లావును.. కత్రినా ఫిట్నెస్ ని ఎగతాళి చేశారని.. ఇప్పుడు వాళ్లను చూసి అందరూ షాక్ తినడమే కాదు.. ఫ్యాన్స్ అయిపోయిన సంగతి కూడా గుర్తు చేస్తోందీ భామ. తను తినే ఆహారంలో కంటే.. తన ఒంటికి పట్టించే క్రీముల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందో అర్ధం చేసుకోమని చెప్పింది.

ఇప్పుడు 31 ఏళ్ల వయసులో నడుం మడతలైనా.. ఇంకే మచ్చలైనా బాధ కలిగించడం లేదన్న సోనమ్.. అసలు ఏ మచ్చా లేకపోవడమే లోపం అనేస్తోంది. ఈ విధంగా ఈమె చేసిన కామెంట్లకు బాలీవుడ్ లో అందరూ చప్పట్లు కొడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/