Begin typing your search above and press return to search.

సోనమ్ అందాల కోసం ఓ యాప్

By:  Tupaki Desk   |   4 May 2016 5:30 AM GMT
సోనమ్ అందాల కోసం ఓ యాప్
X
బాలీవుడ్ హీరోయిన్లలో ఫ్యాషన్ ఐకాన్ ఎవరంటే మరో మాట లేకుండా సోనమ్ కపూర్ పేరు చెప్పేయొచ్చు. హీరోయిన్‌గా ఇప్పటికీ సరిగా నిలదొక్కుకోలేదు కానీ.. హాట్ హాట్ ఫొటో షూట్లు చేయడంలో మాత్రం ఆరితేరిపోయింది. ఈ విషయంలో ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా సోనమ్ కు సాటి రాదు. పెద్ద హిట్లేమీ లేకపోయినా.. స్టార్ హీరోయిన్ల తరహాలో తనకంటూ ఓ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగిందంటే అందుకు ఆమె హాట్ హాట్ ఫొటో షూట్లే కారణం. ఈ ఫాలోయింగ్ ను మరో రకంగానూ వాడుకోవడానికి మంచి ప్లాన్ ఒకటి వేసింది అనిల్ కపూర్ తనయ.

తన పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్ సిద్ధం చేసింది సోనమ్. ఈ యాప్ వాడితే.. సోనమ్ కు సంబంధించిన ప్రతి అప్ డేట్ తెలుస్తోంది. ఆమె ఏ కొత్త ఫొటో షూట్ చేసినా.. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వెంటనే దానికి సంబంధించిన ఫొటోలు.. వీడియోలు.. ఇతర విశేషాలు ప్రత్యక్షమైతాయి. ఇంకా సోనమ్ చేస్తున్న..చేయబోతున్న సినిమాల విశేషాలు కూడా యాప్ లో చూడొచ్చు. ఇంకా సోనమ్ వ్యక్తిగత విశేషాలెన్నో కూడా ఈ యాప్ లో ఉంటాయి. మొత్తంగా సోనమ్ యాప్ వేసుకుంటే ఆమె గురించి సర్వస్వం తెలుసుకోవచ్చు. బహుశా ఇండియాలో ఇలాంటి యాప్ ప్రయోగం చేస్తున్న ఫస్ట్ హీరోయిన్ సోనమే కావచ్చేమో. సోనమ్ అభిమానులారా.. ఇంకెందుకాలస్యం.. యాప్ వేసుకోండి. సోనమ్ తో కలిసి ట్రావెల్ అయిపోయిండి.