Begin typing your search above and press return to search.

పద్దతిగా కనిపిస్తున్న క్లీవేజ్‌ క్వీన్‌

By:  Tupaki Desk   |   9 Feb 2016 3:30 PM GMT
పద్దతిగా కనిపిస్తున్న క్లీవేజ్‌ క్వీన్‌
X
గత కొంత కాలంగా సోనమ్ కపూర్ ఎక్కడ కనిపించినా ఎక్స్ పోజింగ్ తో ఇరగదీసేస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ కట్టిపడేస్తోంది. మళ్లీ క్లీవేజ్ షో అంటే అందరిలాగా కాదు.. అందులోనూ తన స్టైల్ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే.. అందాల ప్రదర్శనతో అభిమానులకు నోట మాట రాకుండా చేసేస్తోంది. కానీ ఒక విషయంలో మాత్రం చాలా పద్ధతిగా.. ఒళ్లంతా కప్పుకుని వస్తోంది సోనమ్ కపూర్.

నీర్జా మూవీ ప్రమోషన్లలో మాత్రం ఇలా పద్ధతులు ఫాలో అవుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అందమైన డ్రస్సులు వేస్తున్నా అందాలతో మాత్రం విందు ఇవ్వడం లేదు. ఇంత పద్ధతిగా ఈ సినిమాకి ప్రచారం చేయడానికి కారణం కూడా ఉందండోయ్. అదే.. ఈ మూవీ రియల్ లైఫ్ స్టోరీ కావడం. సోనమ్ కపూర్ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు నీర్జాకు చాలా వైవిధ్యం ఉంది. ఎంతో ధైర్యంగా హైజాకర్లతో పోరాడి 359మందిని కాపాడిన ధీరవనిత అయిన ఫ్లైట్ అటెండెంట్ స్టోరీ ఇది. అందుకే.. ఈ ఒక్క సందర్భంలో మాత్రం ఏ మాత్రం ఎక్స్ పోజింగ్ లేకుండా.. చక్కగా ముస్తాబై వస్తోంది.

రియల్ లైఫ్ స్టోరీలు చేస్తున్నపుడు.. గ్లామర్ షోలు పెడితే.. ఆయా చిత్రాల్లోని పాత్రలకు సంబంధించిన ఒరిజినల్ కేరక్టర్లపై బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందని ఎవరో సలహా ఇచ్చారట. అందుకే సోనమ్ కపూర్ ఇలా పద్ధతులు పాటిస్తోందని టాక్. సో ఫ్యాన్స్ బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. మిగతా సినిమాలకు సోనమ్ ఎంత మాత్రం పొదుపు పాటించదు.. అది కన్ఫాం.