సోనమ్ లెక్కల్లో బాగా వీక్ అబ్బా

Tue Apr 10 2018 16:22:37 GMT+0530 (IST)

అవకాశం దొరికింది కదా అని విజ్ఞాన ప్రదర్శన చేయాలని చూస్తే... చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు. సినిమాల ఎంపికలో ఎంతో తెలివిగా వ్యవహరించే సోనమ్ కపూర్ ఇలాగే  ఓ ఫజిల్ లెక్కను సమాధానం చెప్పబోయి... పరువు పొగొట్టుకుంది. తప్పుడు సమాధానం చెప్పి దొరికిపోయిన సోనమ్ కపూర్ ను నానా రకాలుగా ట్రోల్ చేస్తూ ఓ ఆటాడేసుకున్నారు ఆమె ఫాలోవర్లు.ఓ బొమ్మను చూపిస్తూ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో చెప్పండి... అంటూ సోనమ్ కపూర్ ని ట్విట్టర్ ద్వారా అడిగాడు ఫిల్మింఫేర్ మ్యాగజైన్ ఎడిటర్ జితేష్ పిల్లాయ్. పాపం... పాప లెక్కల్లో బాగా వీక్ అనుకుంటా... తప్పుడు సమాధానం అయినా కనీసం దరిదాపుల్లో లేని సమాధానం చెప్పింది సోనమ్. దీంతో ‘టెర్రబుల్ అట్ మ్యాథ్స్...’ లెక్కలు రావంటూ ఒప్పేసుకుని నవ్వేసింది సోనమ్. అంతే ‘నీ యాక్టింగ్ కంటే ఘోరం కాదు లే...’ అంటూ ఒకరు.... ‘మ్యాథ్స్ తర్వాత నేర్చుకోవచ్చు గానీ నటన నేర్చుకో ముందు’ అంటూ మరొకరు... ‘అలియా భట్ ను అడిగి నేర్చుకోండంటూ ...’ ఇంకొకరు రకరకాల కామెంట్లు పెట్టారు. ‘ఒకవేళ నువ్వు అనిల్ కపూర్ కూతురివి కాకపోతే... నీకు అస్సలు అవకాశాలే వచ్చేవి కావంటూ... ’ విమర్శలు గుప్పించారు కూడా.

అంతే ఇలా విమర్శలు ఎదుర్కోవడం సోనమ్ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆమె డ్రెస్సింగ్ సెన్స్ మీద... శరీరాకృతి మీద చాలా కామెంట్లే వినిపించాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తోంది అనిల్ కపూర్ కూతురు. తెలియకపోతే ఊరకుండక ఇలా తెలిసినట్టు సమాధానం చెప్పడం ఎందుకు... మళ్లీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని బాధపడడం ఎందుకు అంటూ సలహాలిస్తున్నారు సోనమ్ అభిమానులు.