అక్కాతమ్ముళ్ళ సినిమాల బాక్సాఫీస్ వార్

Thu May 17 2018 13:12:48 GMT+0530 (IST)


టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీ నుంచి హీరో హీరోయిన్ రావడం అనేది చాలా అరుదుగా జరిగే పరిణామం. ఈ మధ్య టాలీవుడ్ లో కొంత మంది ఎదో లిమిట్ లో ట్రై చేస్తున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం కాలం గడుస్తున్న కొద్దీ బ్రదర్ సిస్టర్ లు హీరో హీరోయిన్స్ గా క్రేజ్ అందుకుంటున్నారు. ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేసుకుంటూ వారికంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.ఇక బాలీవుడ్ లో అతిపెద్ద సినిమా గ్యాంగ్ అయిన కపూర్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది నటి నటులు ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు అందులో నుండే సిస్టర్ బ్రదర్ వారి సినిమాను ఒకే రోజు రిలీజ్ చేయనున్నారు. సోనమ్ కపూర్ - హర్షవర్ధన్ కపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు. అయితే సోనమ్ నటించిన వీరే ది వెడ్డింగ్ సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది. కరీనా కపూర్ - స్వర భాస్కర్ కూడా ఈ సినిమాలో నటించారు.

ఇక మరోవైపు హర్షవర్ధన్ కపూర్ - భావేశ్ జోషి:సూపర్ హీరో సినిమా కూడా ఈ జూన్ ఒకటిన రాబోతోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా కోసం మాస్ ప్రేక్షకులు బాగానే ఎదురుచూస్తున్నారు. పైగా ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలైతే ఈ సినిమా మే 25నే రావాలి. కానీ రాజీ - డెడ్ పుల్ 2 సినిమాలు ఎక్కువ థియేటర్స్ ని కవర్ చేయడంతో తేదీని మార్చాల్సి వచ్చింది.అలాగే సోనమ్ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా మెప్పిస్తారో చూడాలి.