ఫోటో స్టోరీ : గుర్తు పడితే ఒట్టు!

Sun Oct 21 2018 09:42:37 GMT+0530 (IST)

బాలీవుడ్ లో గత కొంతకాలంగా ఫ్యాషన్ & ట్రెండ్స్ విషయంలో కాస్తంత స్తబ్ధత కనిపిస్తోంది. ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ అనూహ్యంగా బోయ్ ఫ్రెండ్ ని పెళ్లాడి డీసెంట్ అయిపోవడంతో ఆ స్థానాన్ని బర్తీ చేసేందుకు నవతరం నాయికలు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల  సోనమ్ సోదరీమణులు - కపూర్ గాళ్స్ జాన్వీ - ఖుషీ కపూర్ కొంతవరకూ ప్రయత్నిస్తున్నారు. వీలున్నంత వరకూ ఫ్యాషనిస్టాలుగా ప్రూవ్ చేసుకోవాలన్న తహతహ ఈ సిస్టర్స్ లో కనిపిస్తోంది. అయితే సోనమ్ రేంజులో దూసుకెళ్లడం మాత్రం ఎవరి వల్లా కావడం లేదు.ఇక కపూర్ గాళ్స్ కాకుండా వేరే ఎవరున్నారు? అని వెతికితే.. దిశా పటానీ - లేటెస్టు సెన్సేషన్ కైరా అద్వాణీ మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ & ట్రెండ్స్ తో చెలరేగిపోతూ కొంతవరకూ యూత్ ని ఓ కొమ్ము కాసేస్తున్నారు. పెళ్లయ్యాక ఫ్యాషన్ ని పరాకాష్టలో అనుకరించాలన్న ఆలోచన లేకపోయినా ఎందుకనో సోనమ్ మాత్రం అప్పుడప్పుడూ కొత్త ట్రెండ్స్ ని ఫాలో చేస్తోంది. అయితే అవేవీ పెద్దంతగా క్లిక్ కావడం లేదు.

లేటెస్టుగా ఓ స్పెషల్ ఎల్లో- బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో కనిపించి ఎయిర్ పోర్ట్  లో అందరికీ షాకిచ్చింది. ఈ డ్రెస్ పూర్తిగా లూజ్ గా ఉంది. పైగా తన హెయిర్ ని స్వేచ్ఛగా వదిలేసి నల్ల కల్లద్ధాలు పెట్టుకుని కొత్తగానే కనిపించింది. అయితే ఈ లుక్ చూసిన వెంటనే నెటిజనులు మాత్రం ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇందులో నెగెటివ్ కామెంట్లే అధికం. ఈవిడను చూస్తే ఫీమేల్ కరంచంద్ లా ఉందంటూ ఓ నెటిజన్ వెటకారం ఆడేశాడు. సూపర్భ్ - బ్యూటిఫుల్ అంటూ కొందరు కామెంట్లు పోస్ట్ చేశారు. చోర్ బజార్ - అబ్జల్యూట్ లీ స్టన్నింగ్ అంటూ కొందరు కామెంట్లు పెట్టడం విశేషం.