Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సోనమ్ అందాల విందు

By:  Tupaki Desk   |   19 July 2018 6:27 AM GMT
ఫోటో స్టొరీ: సోనమ్ అందాల విందు
X
పెళ్ళైతే అంతే.. ఇక లైఫ్ ఎండ్ అయినట్టే అనేవాళ్ళకు వెంటనే ముంబై భామలను చూపించాల్సిందే. వాళ్ళకు పెళ్ళైనా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించరు సరికదా మరింతగా పెంచుతూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. ఐశ్వర్య, కరీనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే. ఇప్పుడు ఈ లిస్టులో పోయినేడాది పెళ్లి చేసుకున్న అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ కుడా చేరింది.

సోనమ్ తన చిరకాల మిత్రుడయిన ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలా అని మ్యాగజైన్ కవర్ పేజీలపై హాట్ పోజులివ్వడం మానకుండా బాలీవుడ్ సంస్కృతి ని గట్టిగా కాపాడుతోంది. ఈమధ్యనే ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కి పోజిచ్చిన ఈ సుందరి తన ఒంపు సొంపులను ఏమాత్రం బిడియం లేకుండా చూపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. లైట్ బ్రౌన్ రంగు డిజైన్ వేర్ లో తళుక్కున మెరుస్తూ తనకు సాటి లేదని నిరూపించుకుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే సోనమ్ ఈమధ్యనే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'సంజు' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. మరోవైపు సోనమ్ 'ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా' అనే సినిమాలో నటిస్తోంది.