ఫోటో స్టోరి: మత్స్య కన్యలా ఉందే

Wed Oct 11 2017 18:37:12 GMT+0530 (IST)

బాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సోనమ్ కపూర్ మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. అమ్మడు ఎంచుకునే సినిమాలు చాలా వెరైటీగా ఉంటాయి. తనకు కథ నచ్చితేనే ఒప్పుకుంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సోనమ్ తనకు కథ మీద డౌట్ ఉంటే దర్శకుడికి డైరెక్ట్  గా చెప్పేస్తుందని బాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. అయితే అమ్మడు కాస్త గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటుంది. కేవలం కథ డిమాండ్ చేస్తే తప్ప హాటుగా కనిపించడానికి ఇష్టపడదు.ఇక ఫొటో షూట్స్ లలో కూడా అదే ఫార్ములాను ఉపయోగిసస్తున్నట్టు ఉంది. ఎందుకంటే ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ చాలా కొత్తగా ఉంది. రెగ్యులర్ ఫొటో షూట్స్ కి భిన్నంగా సోనమ్ ఇచ్చిన స్టిల్స్ ని చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కోసం కొత్త స్టైల్ లో ఎవరు ఇవ్వని లుక్స్ తో దర్శనం ఇచ్చింది. డిజైన్ చేసిన ఒక బొమ్మలా సూర్యుడి విరజిమ్మే కాంతుల లాంటి వెలుగులో వయ్యారంగా నిలబడింది.  ఒక యాంగిల్ లో చూస్తే మాత్రం మత్స్య కన్యలా ఉందీ అమ్మడు.

మొత్తానికి సోనమ్ ప్రతి విషయంలో తను కొత్తగా  కనిపించాలని అనుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటో చూస్తే ఆ మ్యాటర్ క్లియ్యర్ గా అర్ధమవుతోంది. ప్రస్తుతం సోనమ్ కపూర్ రాజ్ కుమార్ హిరని తెరకెక్కిస్తోన్న సంజయ్ దత్ బయోపిక్ లో నటిస్తోంది. అలాగే మరో రెండు హిందీ చిత్రాలతో కూడా అలరించనుంది.