Begin typing your search above and press return to search.

ఫ్రీగా ఏదీ చేయ‌ను బుల్లోడా

By:  Tupaki Desk   |   26 Nov 2015 6:04 AM GMT
ఫ్రీగా ఏదీ చేయ‌ను బుల్లోడా
X
బాలీవుడ్ హీరోయిన్ల‌లో సోన‌మ్ క‌పూర్ స్ట‌యిలే వేరు. ఈ అమ్మ‌డు గొప్ప ఫ్యాష‌న్ ప్రియురాలు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ట్రెండ్స్ క‌నుగుణంగా త‌న‌ని తాను మ‌లుచుకుంటూ కొత్త‌గా త‌న‌ని తాను ప్ర‌పంచానికి ఆవిష్క‌రించుకుంటోంది. అందుకే ఇప్పుడున్న అప్‌ క‌మ్ హీరోయిన్ ల‌లో సోన‌మ్ క్రేజు అసాధార‌ణం. ఇటీవ‌లే ఈ ముద్దుగుమ్మ స‌ల్మాన్‌ ఖాన్ స‌ర‌స‌న ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రంలో న‌టించింది. ఈ మూవీ ఉత్త‌రాదిన బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. ఈ సంద‌ర్భంగా త‌న‌ని ప్ర‌శ్నిస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు మాట్లాడింది.

మీరు స‌ల్మాన్ ఖాన్ కోసం ఈ చిత్రంలో ఉచితంగా న‌టించారుట క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. అస‌లు హీరోల‌తో స‌మానంగా హీరోయిన్ల‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని ప‌ట్టుప‌ట్టిన‌దానిని. ఇలా ఉచితంగా ఎందుకు ప‌నిచేస్తాను? అలా ఎలా అనుకున్నారు? అంటూ ఎదురు ప్రశ్నించింది. నేను ఉచితంగా ఏదీ చేయ‌ను. ప‌నికి త‌గ్గ రేటు క‌ట్టాల్సిందే.. అని తెగేసి చెప్పింది. దీన్నిబ‌ట్టి ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో మూవీలో న‌టించినందుకు అమ్మ‌డు ఓ రేంజులోపారితోషికం తీసుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అలాగే నీకంటే స‌ల్మాన్ చాలా పెద్ద‌వాడు. వ‌య‌సులో చాలా డిఫ‌రెన్స్ ఉంది క‌దా? అని ప్ర‌శ్నిస్తే .., మైనే ప్యార్ కియా చూసిన‌ప్పుడు నా వ‌య‌సు ఐదేళ్లు. అప్ప‌టికి స‌ల్మాన్ వ‌య‌సు 19 ఉండొచ్చు. అయినా వ‌య‌సుతో ప‌నేం ఉంది న‌టించేందుకు.. మా జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌న్న టాక్ వ‌చ్చింది. అది చాలు క‌దా? అని మ‌రోసారి క్వ‌శ్చ‌న్ చేసింది. అదీ సంగ‌తి. సోన‌మ్ ఎంత గ‌డుసుపిల్లో క‌దా?