Begin typing your search above and press return to search.

ఏంటో.. ఈ శారీ గెటప్పు...

By:  Tupaki Desk   |   27 May 2016 12:39 PM GMT
ఏంటో.. ఈ శారీ గెటప్పు...
X
బాలీవుడ్ లో ఫ్యాషన్ రోజుకో టర్న్ తీసుకుంటూనే ఉంటుంది. కొత్త కొత్త స్టైలింగ్స్ దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందాల భామలు రకరకాల గెటప్ లతో ఆకట్టుకునేందుకు ట్రై చేస్తుంటారు. సోనమ్ కపూర్ లాంటి టాప్ రేంజ్ యంగ్ భామలైతే.. కాస్ట్యూమ్స్ తో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మొదట్లో పద్ధతిగా ఉండేందుకు ట్రై చేసిన సోనమ్ కపూర్ కొన్ని నెలలుగా ట్రెండ్ మార్చేసింది.

ఎక్కడ చూసినా క్లీవేజ్ ని ఫుల్లుగా చూపించేస్తూ డ్రస్సులు వేసుకొచ్చింది. ఇప్పుడో ఈవెంట్ లో అమ్మడి గెటప్ చూసి మైండ్ బ్లాంక్ అయింది జనాలు. చూసేందుకు చీర జాకెట్ వేసుకొచ్చినట్లే ఉంటుంది కానీ.. ఆ కట్టులోనే తన స్పెషాలిటీ చూపించింది సోనమ్. బొడ్డుకు బెత్తెడు కిందకు కట్టడం ఎప్పటి నుంచో ఉన్న స్టైలే. అందుకే కాళ్లు కనిపించేలా మూరడు పైకి చీరను కట్టింది. సోనమ్ చీర కట్టిన ఈ పద్ధతి.. ఇప్పుడు స్టైల్ అయిపోతోంది.

గతంలో ఇలా ఎవరన్నా ఇలా చీర కట్టుకుంటే వాళ్లను బాగా మాస్ గా ఉన్నారని అనేవారు. అలాగే గతంలో ఇలాంటి గెటప్ లలో ఇంట్లో పనివాళ్లు కనిపించేవారు. అయితే ఇప్పుడు.. ఏ స్టైల్ ఫాలో అవ్వాలో అర్ధం కాక.. తమ ఇంట్లో పనమ్మాయి గెటప్ నే సోనమ్ వేసుకొచ్చేసి.. కొత్త స్టైల్ అంటోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ స్టైలింగ్ ఎన్నాళ్లు ఉంటుందో! ఎంతమంది ఫాలో అవుతారో!