Begin typing your search above and press return to search.

సోనమ్ సినిమాకి పాక్ లో బ్రేక్

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:51 AM GMT
సోనమ్ సినిమాకి పాక్ లో బ్రేక్
X
ఇండియన్ మూవీస్ కి పాకిస్తాన్ లో భారీ డిమాండ్ ఉంటుంది. మన స్టార్లు అక్కడ కూడా కుమ్మేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సినిమాలను మాత్రం పాక్ నిషేధిస్తూ ఉంటుంది. రిలీజ్ కాకుండా అడ్డు పడుతూ ఉంటుంది. ఇఫ్పుడా జాబితాలోకి మరో సినిమా చేరింది. సోనమ్ కపూర్ నటించిన నీరజా చిత్రాన్ని పాక్ లో నిషేధించేశారు.

30 ఏళ్ల క్రితం కరాచీ ఎయిర్ పోర్ట్ లో పాన్ అమెరికన్ ఫ్లైట్ 73 హైజాక్ కు గురైతే.. ఆ పరిస్థితుల్లో 369మందిని కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఓ ఫ్లైట్ అటెండెంట్ నీరజా భానోట్ కథే ఈ సినిమా. ఈ రోల్ లో సోనమ్ కపూర్ సరిగ్గా సరిపోయందనే ప్రశంసులు వస్తుండగా.. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా నీర్జాను రిలీజ్ చేయనున్నారు. అయితే.. కనీసం పాకిస్తాన్ సెన్సార్ బోర్డుకు ఈ చిత్రాన్ని సమర్పించకుండానే.. నిషేధిస్తున్నట్లు చెప్పేసింది ఆ దేశం. నీర్జాలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయని.. అలాగే ముస్లింలను చెడుగా చూపించారనే ఆరోపణలు చేస్తూ.. ఈ చిత్ర విడుదలను అడ్డుకుంది దాయాది దేశం.

మొదట నీర్జా చిత్రాన్ని దిగుమతి చేసేందుకు అనుమతించిన పాక్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్.. ఆ తర్వాత విడుదలకు వీల్లేదని చెప్పేసింది. ఇదిలా ఉంటే.. నీరజా భానోట్ సాహసానికి మెచ్చి ఆమె మరణించిన అనంతరం అశోక్ చక్ర అవార్డును భారత్ ప్రకటించింది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలు ఆమే.