Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మళ్లీ సోనమ్ సొగసుల మోత

By:  Tupaki Desk   |   21 Feb 2017 8:01 AM GMT
ఫోటో స్టోరి: మళ్లీ సోనమ్ సొగసుల మోత
X
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ చేసే పాత్రలు ఎక్కువగా ట్రెడిషనల్ గా ఉంటాయి. అయితే.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అమ్మడు అల్ట్రా మోడర్న్. అలాగని ఈమె ట్రెడిషన్స్ ఫాలో అవదా అంటే.. విషయం అది కాదు కదా. సినిమాల్లో కనిపించే సోనమ్ కి.. బయట ఫోటోషూట్స్ లో రచ్చ చేసే సోనమ్ కి చాలానే డిఫరెన్స్ కనిపిస్తుంది.

తాజాగా సోనమ్ కపూర్ ఓ స్టూడియోలో చేసిన ఫోటో షూట్ లో పాల్గొంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దుస్తుల్లో.. సోనమ్ అందాల మోత మరీ పిచ్చెక్కించేస్తోంది. లో డీప్ లో నెక్ టాప్.. బంగారం లాంటి అందాలను దాచలేక తెగ ఫీలయిపోతుంటే.. మరోవైపు కాలి సోయగాలను కనిపించకుండా ఆపడంలో ట్రాన్స్ పరెంట్ గౌన్ మరీ ఇబ్బంది పడిపోతోంది. వీటన్నిటికి కంటే రెండు కళ్లు మూసుకుని మత్తుగా చూస్తున్న సోనమ్ ఫీలింగ్స్ కుర్రకారును తెగ డిస్టర్బ్ చేసేస్తున్నాయి.

గతేడాది నీర్జా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సోనమ్ కపూర్.. ప్రస్తుతం సంజయ్ దత్ బయోపిక్ 'దత్' లో నటిస్తోంది. దీంతో పాటు పద్మన్.. వీర్ ది వెడ్డింగ్ చిత్రాలను త్వరలో ప్రారంభించబోతోంది బంగారు బొమ్మ సోనమ్ కపూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/