ఫోటో స్టొరీ: సోనమ్ తో పని కాదు బాబోయ్

Thu Jun 13 2019 07:00:02 GMT+0530 (IST)

బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు చాలామందే ఉంటారు. వారు జస్ట్ ఒక ఫోటోతోనే సోషల్ మీడియా టెంపరేచర్ ను మూడు నాలుగు పాయింట్లను అవలీలగా పెంచగలరు.  అయితే అదే సామాజిక మాధ్యమాల ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు.. నెటిజనుల చేత ఫ్యాషన్ ఐకాన్.. ఫ్యాషనిస్టా అనిపించుకోవడం మాత్రం సోనమ్ కపూర్ కే చెల్లింది.  మోడరన్ డ్రెస్ కానివ్వండి.. సాంప్రదాయ దుస్తులు కానివ్వండి.. బికినీ కానివ్వండి..  డ్రెస్ ఏదైనా తనదైన గ్రేస్ తో యాటిట్యూడ్ తో ఫ్యాషనబుల్ గా ధరించడం సోనమ్ స్పెషాలిటీ.సోనమ్ పోయినేడాది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను వివాహమాడి శ్రీమతిగా మారిన సంగతి తెలిసిందే.  అయితే భర్తగారికి  తన శ్రీమతి అంటే ఎంతో మురిపెం.  భార్య అంటే చులకనగా చూస్తూ.. వారితో అబద్ధాలు చెప్తూ.. వారిని రకరకాలుగా వేధించే పురుషాధిక్య సమాజం మెంబర్ కాదాయన.  భార్యగారి షూ లేస్ ఊడిపోతే.. పబ్లిక్ గా కెమెరాల ముందు ముడులు వేసిందాకా ఆయన మనసు కుదుట పడదు!  ఇంత ప్రేమ సామ్రాజ్యంలో ఓలలాడుతున్న సోనమ్ రీసెంట్ గా ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలను సోనమ్ ఫ్యాన్స్ మెయింటెయిన్ చేసే ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

క్రీమ్ కలర్ ఛోళీ.. అదే రంగులో ఉన్న లెహెంగాతో సోనమ్ ఫోటో షూట్ చేసింది.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ షెలా ఖాన్ డిజైన్ చేసిన ఈ డ్రెస్ కు ఎంబ్రాయిడరీ సూపర్ గా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రెస్ అద్భుతం.  ఈ డ్రెస్ ను తనదైన స్టైల్ లో ధరించి సోనమ్ సూపర్ పోజులిచ్చింది. ఈ డ్రెస్ తో పాటు మరో వైట్ కలర్ డ్రెస్ లో కూడా దుమ్ములేపే పోజులిచ్చింది. అసలు ఈ పోజులు చూస్తే మనకు మెల్లగా బైబై చెప్తున్న ఎండాకాలం కాస్తా "నేనున్నాను.. నేను విన్నాను.. నేను చూశాను.. నేను తిరిగి వస్తున్నాను" అంటూ వెనక్కి వచ్చేస్తుందేమో.

సోనమ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'ది జోయా ఫ్యాక్టర్' అనే చిత్రంలో నటిస్తోంది. అనుజా చౌహాన్ రాసిన ది జోయా ఫ్యాక్టర్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 20 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.