పెళ్లికూతురు స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తోందే

Mon Apr 16 2018 14:44:14 GMT+0530 (IST)

బాలీవుడ్ లో మరో గ్రాండ్ వెడ్డింగ్ తో సందడి మొదలైంది. రీసెంట్ గా హీరోయిన్ అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కొద్ది రోజుల్లోనే ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఆమే అనిల్ కపూర్ డాటర్ సోనమ్ కపూర్. ఈ భామ చాలారోజులుగా సినిమాల్లో నటిస్తున్నా ఈమధ్య వచ్చిన నీర్జా సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఢిల్లీకి చెందిన బిజినెస్ మెన్ ఆనంద్ అహూజా.. సోనమ్ కపూర్ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరి మ్యారేజ్ కు రెండువైపులా గ్రీన్ సిగ్నల్ రావడంతో వచ్చే నెలలో ముంబయిలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అనుష్క - విరాట్ లాగే వీళ్లు కూడా వైభవంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే పెళ్లి పనులు మొదలెట్టేశారు. నార్త్ లో మ్యారేజ్ కన్నా ముందు సంగీత్ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ సందర్భంగా ఆటాపాటలతో సందడి చేస్తారు. ఈ సంగీత్ లో సోనమ్ నటించిన సినిమాల్లోని పాటలకే కొత్త జంట స్టెప్పులేయనుంది. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ వీళ్లకు సెప్పులు నేర్పించే పనిలో పడిపోయింది. ఈ సందర్భంగా ఫరాతో కలిసి సోనమ్ ఫొటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రేమలో పడినప్పటి నుంచి సోనమ్ సినిమాలు బాగా తగ్గించింది. ప్రస్తుతం ఆమె వీర్ దే వెడ్డింగ్ సినిమా మాత్రమే చేస్తోంది. ఇందులో సోనమ్ తోపాటు కరీనా కపూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. యూనిట్ కు ఇబ్బంది ఎదురవకుండా పెళ్లయిన మూడోరోజు నుంచే షూటింగ్ కంటిన్యూ చేస్తానని సోనమ్ చెబుతోంది.