Begin typing your search above and press return to search.

అక్క‌డ కూడా గ్లామ‌రేనా సోన‌మ్

By:  Tupaki Desk   |   19 April 2018 11:15 AM GMT
అక్క‌డ కూడా గ్లామ‌రేనా సోన‌మ్
X
అనిల్ క‌పూర్ కూతురిగా బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సోన‌మ్ క‌పూర్‌... తండ్రికి త‌గ్గ త‌న‌యగా బాగానే పేరు తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే కూడా అమ్మ‌డు ఫోటో షూట్లు... అందులో ఆమె డ్రెస్సింగ్ ద్వారానే ఫుల్లు పాపులారిటీ తెచ్చుకుందీ అనేది నిజం. త్వ‌ర‌లో పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతున్న ఈ భామ‌... పెళ్లి షాపింగ్ కోసం దుబాయ్ వెళ్లింది.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ అహుజాతో ఎన్నో రోజులుగా పీక‌ల్లోతు ప్రేమలో మునిగి ఉన్న సోన‌మ్... మే 11- 12 రెండు రోజుల పాటు సాగే పెళ్లి వేడుక‌తో పెళ్లి కూతురు కాబోతోంది. వీరి వివాహానికి స్విట్జ‌ర్లాండ్ లోని జెనెవా వేదిక కానుంది. పెళ్లి డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో షాపింగ్‌... స్పా... మేక‌ప్ అరేంజ్ మెంట్స్ తో బిజీబిజీగా గ‌డుపుతోంది సోన‌మ్‌. లండ‌న్ లో కాబోయే భ‌ర్త‌తో క‌లిసి కొన్ని రోజులు గ‌డిపిన సోన‌మ్‌... అటు నుంచి ఆస్ట్రియా వెళ్లి ఐదు రోజులు స్పా రీట్రీట్‌ చేయించుకుంది. ప్ర‌స్తుతం దుబాయ్ లో ఉన్న ఈ భామ అక్క‌డ తీసుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. డార్క్ బ్లూ క‌ల‌ర్ డ్రెస్సు వేసుకున్న సోన‌మ్‌... ఎద అందాలు క‌నిపించేలా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. దానికి తోడు ఆ డ్రెస్సు డిజైన్ కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న కోస‌మే చేసిన‌ట్టుగా పార‌ద‌ర్శ‌కంగా ఉండ‌డంతో అందులోంచి కూడా కావల్సిన‌న్ని అందాలు క‌నిపిస్తున్నాయి.

ఈ ఫోటోలు పెట్ట‌డ‌మే కాదు... చేతి వాచీ నుంచి డ్రెస్సు దాకా ఏది ఎక్క‌డ కొన్న‌దీ బ‌డాయి పోతూ చెప్పిందీ బ‌క్క‌పిల్ల‌. పెళ్లి షాపింగ్ చేస్తూ కూడా ఇంత‌లా రెచ్చిపోవాలంటే గ‌ట్స్ ఉండాలి. అవి 32 ఏళ్ల సోన‌మ్ ద‌గ్గ‌ర బోలెడు.