ఫోటో స్టోరి: బుట్టబొమ్మలా సోనమ్

Wed May 16 2018 10:26:52 GMT+0530 (IST)

ఇండియన్ సినిమా మార్కెట్ పెరిగినట్టే ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ స్థాయి కూడా చాలా వరకు పెరుగుతూ వస్తోంది. మన తారల అందాలకు ప్రపంచ మొత్తం ఫిదా అయిపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ తారలకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం వస్తోంది. ఇండియా హీరోయిన్స్ అంటే ఈ మధ్య హాలీవుడ్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరి స్టైల్ లో వారు సత్తా చాటుతున్నారు.ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక అదే తరహాలో రీసెంట్ గా పెళ్లి కూతురు అయిన సోనమ్ కపూర్ కూడా తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. కేన్స్ రెడ్ కార్పెట్ పై తన సరికొత్త ఫ్యాషన్ డ్రెస్ లో అందరిని ఎంతగానో ఆకర్షించింది. సోనమ్ కేన్స్ 2018 రెండో రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం వెరా వాంగ్ కోచర్ గౌనును ఎంపిక చేసుకుంది. ఇక క్లివేజ్ ను కూడా యాడ్ చేసి ఆ వాతావరణం చేంజ్ అయ్యేలా చేసింది. అమ్మడు పెళ్లి తరువాత ఈ రేంజ్ లో కనిపిస్తుంది అని ఎవరు ఊహించలేదు. బుట్ట బొమ్మలా కనిపిస్తూనే హాట్నెస్ తో ఇరగదీసింది.

ఇటీవల సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజా ని హిందు సంప్రదాయం ప్రకారం వివహమాడిన సంగతి తెలిసిందే. ఆ పెళ్లి వేడుకలు ముగియగానే అమ్మడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇలా హాట్ గా దర్శనమిస్తోంది. ప్రస్తుతం అమ్మడు కొన్ని బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.