కేన్స్ 2019: మహారాణి వారు వేంచేశారు

Tue May 21 2019 10:35:55 GMT+0530 (IST)

ఫ్యాషనిస్టా అన్న పదానికి సిసలైన నిర్వచనం సోనమ్ కపూర్. ప్యారిస్ కే తలతిరిగే ఫ్యాషన్ ని ఈ కపూర్ గాళ్ ఏనాడో పరిచయం చేసింది. ఇండస్ట్రీ బెస్ట్ లుక్ తో  ప్రపంచం తన వైపు తల తిప్పి చూసేలా చేసింది. ముంబై టు ప్యారిస్ ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా అక్కడ వాలిపోతూ తనదైన స్టైల్లో అందాల ఎలివేషన్ తో సోనమ్ నిరంతరం హాట్ టాపిక్ అయ్యింది. దిల్లీ బిజినెస్ మ్యాగ్నెట్ అహూజాని పెళ్లాడినా.. ఫ్యాషన్ ప్రపంచంతో తన అనుబంధం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అది అంతకంతకు దినదిన ప్రవర్థమానం అవుతోంది.ఇటీవల పలు మ్యాగజైన్ కవర్ షూట్లతో దిమ్మతిరిగే ట్రీటిచ్చిన సోనమ్ ప్రస్తుతం కేన్స్ 2019 ఉత్సవాల్లో తనదైన స్టైల్లో  చెలరేగుతోంది. ఇప్పటికే రకరకాల డిజైనర్ డ్రెస్ లలో సోనమ్ హీటెక్కించింది. తాజాగా ఇండియన్ ట్రెడిషన్ కి ఏమాత్రం భంగం కలగని రీతిలో మహారాణి లుక్ తో కేన్స్ జనాలకు అదిరిపోయే ట్రీటిచ్చింది. మొఘల్ సామ్రాజ్యపు మహారాణుల్ని తలపించే అద్భుతమైన గోల్డ్ కలర్ మహారాణి డిజైనర్ డ్రెస్ లో వేడెక్కించింది. ఈ డ్రెస్ ని అబుజానీ - సందీప్ కోస్లా రూపొందించిన అరుదైన డిజైన్ ఇది.

రోమన్ రాణులకే కన్ను కుట్టే ఇంప్రెస్సివ్ డిజైన్ ఇది. ట్రాయ్ సుందరీమణులు సైతం ఈ లుక్ చూసి పరేషాన్ అవ్వాల్సిందే. నాటి భారతీయ మహారాణులు ఇంతందమైన డిజైనర్ డ్రెస్ లలో కనిపించారో లేదో కానీ.. నేటి తరం మహారాణిగా సోనమ్ పెర్ఫెక్ట్ ఫిట్ అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. టాప్ టు బాటమ్ ఆ కలర్ గ్రేడింగ్.. దానికి కాంబినేషన్ గా మెడలో బంగారు వర్ణం హారం మహదాద్భుతం. స్టైల్ అన్న పదానికే నిర్వచనంగా నిలిచింది. ఇకపోతే సోనమ్ తో పాటు ఐశ్వర్యారాయ్ నిన్నటిరోజున అద్భుతమైన డిజైనర్ మత్స్యావతారంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 25వరకూ కేన్స్ ఉత్సవాలు జరగనున్నాయి.