ఇఫ్తార్ విందులో గ్లామర్ షోనా?

Tue Jun 12 2018 15:30:50 GMT+0530 (IST)

ఏదైనా మతానికి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కొన్ని పద్దతులను పాటించడం సంస్కారం. మనల్ని పిలిచినవారికి మనతో పాటు వచ్చినవారికి గౌరవంగా ఉంటుంది. మన చిత్తానికి ఉంటాం మా ఇష్టం అంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. బాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ విషయంలో గీత దాటి ప్రవర్తించడం చూస్తుంటే ఈ పోకడ ఎక్కడికి దారి తీస్తుందో అన్న అనుమానం రాకమానదు. విచిత్రం ఏంటంటే తమ స్వంత మతాలనే కించపరిచేలా వీరి చర్యలు ఉండటం. ప్రియాంకా చోప్రా ఓ ఇంగ్లీష్ సిరీస్ లో రుద్రాక్ష గురించి అవమానకర రీతిలో ఉన్న సీన్లో ఏ మాత్రం ఆలోచించకుండా నటించడం ఇప్పటికే తీవ్ర విమర్శలు రేపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు తనకు తోడుగా సోనాలి రౌత్ తయారయ్యింది. ప్రముఖ కాంగ్రెస్ నేత బాబా సిద్ధికీ ప్రతి సంవత్సరం రంజాన్ పండగ సందర్భంగా ప్రత్యేక విందు ఇవ్వడం అలవాటు. దానికి బాలీవుడ్ తారాలోకం మొత్తం తరలివస్తుంది. నిన్నా కూడా అదే విధంగా ఆహ్వానితులు అందరు వచ్చారు. సోనాలి రౌత్ కూడా వచ్చింది.పవిత్రమైన రంజాన్ పండగకు సందర్బంగా ఏర్పాటు చేసిన విందు కాబట్టి కాస్త సాంప్రదాయ బద్ధంగా వెళ్లడం శుభస్కరం. కానీ సోనాలి మాత్రం తానేదో ఫాషన్ షోకు వెళ్తున్నట్టుగా కురచ దుస్తులు వేసుకుని వెళ్లడమే కాక అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ కూడా చేసుకుంది. హిందీ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో బాగా పాపులర్ ఐన సోనాలి ఆ మాత్రం దానికే కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయి. ఇంకేముంది ఆ ఫోటోలు చూసిన అభిమానాలు విమర్శల బాణాలు సంధించారు. ఇతర మతాల వారు ఇలాంటి డ్రెస్ తో వెళ్తే ఒప్పుకోరని మతానికి ఇస్లాంకు  కాకపోయినా కనీసం రంజాన్  పవిత్రతకు గౌరవం ఇవ్వాలని తిట్టి పోశారు. అయినా తన నుంచి రెస్పాన్స్ లేదు లెండి. సల్మాన్ ఖాన్-అనిల్ కపూర్-కత్రినా కైఫ్ లాంటి సెలెబ్రిటీలు సైతం హుందాగా వస్తే రెండంటే రెండు హిందీ బూతు సినిమాల్లో నటించిన సోనాలి రౌత్ మాత్రమె ఇలా వయ్యారాలు పోవడం బాలేదు. నడుం మొత్తం కనిపించేలా భుజాలు ఓపెన్ గా పెట్టేసుకుని టాప్ లేకుండా వచ్చిన సోనాలిని చూస్తే షో చేయడానికి వచ్చిందనటంలో డౌట్ అక్కర్లేదు.