Begin typing your search above and press return to search.

హీరోయిన్ పాత్రలపై సోనాలి విసుర్లు

By:  Tupaki Desk   |   24 April 2017 5:00 AM GMT
హీరోయిన్ పాత్రలపై సోనాలి విసుర్లు
X
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరే. మురారి.. ఇంద్ర.. మన్మథుడు వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులతో బోలెడంత అనుబంధం పెంచేసుకుంది ఈ భామ. తెలుగు తెరపై పెదాలు కదిపేందుకు అవసరమైనంత మేరకు తెలుగు నేర్చుకున్నానని చెప్పిన సోనాలి.. ఇక్కడి ప్రజలు ఆదరించిన తీరు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పింది.

తెరపై ఒకప్పటి హీరోయిన్ అయినా.. జీవితంలో మాత్రం భార్య.. తల్లి.. రచయిత.. పాఠకురాలు.. మాజీ నటి హోదాలను ఒకేసారి కొనసాగించగలుగుతోంది సోనాలి. తాజాగా హైద్రాబాద్ లో జరిగన ఫిక్కీ లేడీస్ మీట్ లో పాల్గొన్న ఇంద్ర హీరోయిన్.. హీరోయిన్స్ పాత్రలతో తనకు వ్యక్తిగతంగా చాలా సమస్యలున్నాయని అంటోంది. ' చక్కటి లుక్స్ తో.. నడుం బాగా ఊపగలిగే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీ మేకర్స్ అంతకు మించి మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు. అందుకే నేను రచయితగా.. ఆ ఇమేజ్ నుంచి.. ఆ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటాను.. అదే చేస్తున్నాను' అని చెప్పింది సోనాలి బింద్రే.

'యాక్ట్రెస్ అంటే గ్లామర్ పర్సనాలిటీ. నాలో ఉన్న ఆ యాంగిల్ నాకు నచ్చినదే అయినా. రైటర్ గా మాత్రం ఆ ఇమేజ్ కి దూరంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి పుస్తకాలతో ఎక్కువ సహవాసం చేశాను' అని చెప్పింది సోనాలి బింద్రే. అతి పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయడం ఈమెకు సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న కల అంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/