Begin typing your search above and press return to search.

బంగారు బుచ్చెమ్మ ఇలా చూడలేమమ్మా!

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:29 AM GMT
బంగారు బుచ్చెమ్మ ఇలా చూడలేమమ్మా!
X
చాలా ఏళ్ళ క్రితం మురారి సినిమాలో మహేష్ బాబు బంగారు కళ్ళ బుచ్చెమ్మ అంటూ హీరోయిన్ సోనాలి బెంద్రేను ఉడికిస్తూ పాడే పాట ప్రిన్స్ ఫ్యాన్స్ కే కాదు సగటు సినిమా ప్రేమికులకు కూడా బాగా గుర్తుండిపోతుంది. అందులో సోనాలి చేసిన అల్లరి చూపించిన సొగసైన అందం చాలా కాలం మనవాళ్ళను వెంటాడింది. మెగాస్టార్ తో బ్యాక్ టు బ్యాక్ ఇంద్ర శంకర్ దాదా ఎంబిబిఎస్ రూపంలో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సోనాలి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో అగ్ర హీరోల సరసన మంచి చాన్సులు కొట్టేసిన సోనాలి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పేసింది. ఇటీవలే తనకు కాన్సర్ ఉందన్న విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిన సోనాలి కీమో థెరపీలో భాగంగా జుత్తు మొత్తం తీసేసిన ఫోటోను గతంలో షేర్ చేయటం అవి చూసిన అభిమానుల గుండెలు పగిలిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత ప్రియాంకా చోప్రా మంచి విగ్ స్పెషలిస్ట్ ను పరిచయం చేయటం వెంటనే సోనాలి తనకు నప్పే విగ్ ఒకటి సెట్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా తనను ఇష్టపడే వాళ్ళ మనసులు మెలితిప్పే మరో ఫోటో పోస్ట్ చేసింది సోనాలి.

అమోర్ టౌలెస్ రాసిన ఏ జెంటిల్ మెన్ ఇన్ మాస్కో పుస్తకాన్ని చదువుతున్నట్టుగా స్టిల్ ఇచ్చిన సోనాలి అందులో ఎలాంటి విగ్ లేకుండా మళ్ళి నున్నని గుండుతోనే దర్శనమిచ్చింది. భర్త గోల్డీ బెహెల్ ట్రీట్మెంట్ గురించి అప్ డేట్స్ ఇస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చికిత్స సాగుతోందని చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం కుదుట పడటం లేదు. జుట్టు లేకపోయినా సోనాలిలో ఉన్న క్యూట్ నెస్ చిరునవ్వులో ఏ మాత్రం మార్పు లేకపోవడం ఆమె మనోనిబ్బరానికి ఉదాహరణగా చెప్పొచ్చు. నెటిజెన్లు మాత్రం సోనాలిని ఇలా కూడా ఎవరికీ తీసిపోని అందంతో అద్భుతంగా ఉన్నావని తనకు మానసిక బలాన్ని ఇస్తున్నారు. అంతా సెట్ అయితే సోనాలి మళ్ళి సినిమాల్లోకి వస్తానని చెబుతోంది. అదే జరగాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.