Begin typing your search above and press return to search.

అనుష్క ఓకే.. సోనాల్ కి కూడా అదేనా?

By:  Tupaki Desk   |   26 Nov 2015 7:30 PM GMT
అనుష్క ఓకే.. సోనాల్ కి కూడా అదేనా?
X
సైజ్ జీరో రిలీజ్ గంటల్లోకి వచ్చేసరికి.. అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలన్నీ బయటకు తీసి ప్రచారం చేస్తోంది యూనిట్. ఇప్పటికే గోల్డ్ కాయిన్స్ అన్నారు, మేకింగ్ వీడియోస్ అన్నారు, గిఫ్ట్ కూపన్స్ అన్నారు.. కార్పొరేట్ స్టయిల్లో షాపింగ్ మాల్ ఆఫర్స్ లాగా.. సినిమా టికెట్లకీ గిఫ్ట్ వోచర్ పెట్టేసి మంచి హైప్ నే క్రియేట్ చేశారు. ఇప్పటివరకూ ప్రచార భారం మొత్తం అనుష్క ఒకటే మోస్తే.. ఇపుడు సోనాల్ చౌహన్ కూడా జతయ్యింది.

కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్స్ ని గ్లామర్ గా తయారై రమ్మంటారు నిర్మాతలు. కాస్త నలుగురు ఎక్కువ సేపు చూడ్డానికి, నాలుగు సార్లు మాట్లాడుకోవడానికి హెల్ప్ అవుతుందని ఇలా కోరుకుంటారు. కానీ సైజ్ జీరోకి మాత్రం హీరోయిన్స్ పీవీపీ లోగో ఉన్న ఫుల్ టీ షర్టులు వేసుకుని వచ్చేస్తున్నారు. సైజ్ జీరో సినిమా కంటే.. పీవీపీ బ్రాండ్ ప్రమోషన్ గానే ఈ కార్యక్రమాలు అనిపిస్తున్నాయి. ఇలా అందరినీ ఒకే టైప్ డ్రెస్సింగ్ లో చూస్తుంటే.. కార్పొరేట్ కంపెనీలు ఏదో స్పెషల్ కేంపెయిన్ చేపట్టినట్లుగా ఉంది. అయినా గ్లామర్ హీరోయిన్స్ ని ఎదురుగా పెట్టుకుని.. టీషర్టుల్లో చూడమని చెప్పడం నిర్మాతకు ఏమన్నా భావ్యంగా ఉందా అనిపిస్తోంది. పోనీ.. అనుష్కని అన్నారంటే ఓకే.. ఎలాగూ సినిమాల్లో తప్ప బయట గ్లామర్ ఒలికబోసినది బాగా తక్కువ.

మరి సోనాల్ చౌహాన్ ని అడిగితే కాదంటుందా చెప్పండి. కాస్త ఓ మాట పడేస్తే చాలు.. వయ్యారాలు చిందించేస్తుంది. మరి మన టాలీవుడ్ బికినీ బ్యూటీని కూడా టీషర్టుల్లో చూపిస్తున్నారు పీవీపీ. గ్లామర్ కావాలంటే సినిమా చూడండి అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం.