Begin typing your search above and press return to search.

బోర్ కొట్టేసిందంటున్న బాలయ్య హీరోయిన్

By:  Tupaki Desk   |   26 Nov 2015 10:30 PM GMT
బోర్ కొట్టేసిందంటున్న బాలయ్య హీరోయిన్
X
హీరోలకు కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు ఫెయిల్యూర్లు ఎదురైనా పర్వాలేదు.. బేస్ ఉంటుంది - బ్యాకప్ ఉంటుంది కాబట్టి నిలదొక్కుకోవచ్చు. కానీ హీరోయిన్లకు అలాంటి అవకాశం ఉండదు. తొలి సినిమా ఫ్లాప్ అయిందంటే తట్టా బుట్టా సర్దేసుకోవడమే. వీఎన్ ఆదిత్య సినిమా ‘రెయిన్ బో’తో టాలీవుడ్ కు పరిచయమైన ముంబయి భామ సోనాల్ చౌహాన్ కూడా ఐదేళ్ల కిందట అలాగే సర్దేసుకుని వెళ్లిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా బోయపాటి ‘లెజెండ్’ సినిమాతో మళ్లీ ఆమెను టాలీవుడ్ కి ఆహ్వానించాడు. ఆ సినిమా హిట్టయిన సోనాల్ కు మంచి అవకాశాలే తెచ్చింది. పండగ చేస్కో, ఆమె ఖాతాలో మరో హిట్ జమ చేసింది. ఇప్పుడు ఆమె కీలక పాత్ర పోషించిన ‘సైజ్ జీరో’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

తన ప్రతి సినిమాలోనూ గ్లామర్ విందు చేస్తున్న సోనాల్ కు ఈ పాత్రలైతే బోర్ కొట్టేస్తున్నాయట. కొంచెం వైవిధ్యమైన పాత్రలు కోరుకుంటున్నట్లు చెప్పింది సోనాల్. ‘‘నా క్యారెక్టర్లు రొటీన్ అయిపోతున్నాయన్న ఫీలింగ్ కలుగుతోంది. నా నుంచి గ్లామర్ రోల్సే ఆశిస్తున్నారు. అలాంటి పాత్రలే ఇస్తున్నారు. ఐతే నాకిప్పుడు పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ఈ విషయంలో సైజ్ జీరో నాకు మంచి అవకాశంగా భావిస్తున్నా. ఇందులో ఎన్నారై గర్ల్ గా నటిస్తున్నా. ఈ పాత్ర గ్లామరస్ గా ఉంటూనే పెర్ఫామెన్స్ కు కూడా స్కోప్ ఇచ్చింది. నా కెరీర్ లో ఇదో భిన్నమైన సినిమా అవుతుంది. దీని తర్వాత మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నా’’ అని చెప్పింది సోనాల్. బాలయ్యతో సోనాల్ మరోసారి జంటగా నటిస్తున్న ‘డిక్టేటర్’ సంక్రాంతికి విడుదల కాబోతోంది.