Begin typing your search above and press return to search.

సోనాల్‌ లెగ్గు మహిమ ఎలా ఉందో

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:30 PM GMT
సోనాల్‌ లెగ్గు మహిమ ఎలా ఉందో
X
సోనాల్ చౌహాన్‌. అబ్బే సూపర్‌ యాక్టరేమీ కాదు. కాకపోతే మతి పిచ్చెత్తిపోయే ఫిగర్‌ ఈమెకు సొంతం. ఏదో యామీ జాక్సన్‌ వంటి ఫారిన్‌ భామలే రెండు పీసుల బికినీ వేసుకొని కూడా డ్యాన్సులు చేస్తారు అని భ్రమ పడుతున్న టాలీవుడ్ లో.. మన పాపలు కూడా కావాలంటే బికినీలోనే పాట మొత్తం హడావుడి చేయగలరు అంటూ ప్రూవ్‌ చేసిందీ అమ్మడు.

అసలు ఈ భామ బికినీ వేస్తే చాలు.. మొన్న లెజండ్‌ హిట్‌.. నిన్న పండగ చేస్కో హిట్‌.. కాని కళ్యాణ్‌ రామ్‌ షేర్‌ సినిమాలో మాత్రం ఏ రేంజులో అందాలు ఆరబోసినా కూడా అది ఫ్లాపే అయ్యింది. ఇప్పుడు అన్నిచోట్లా ఒక్కటే డిస్కషన్‌. సైజ్‌ జీరో సినిమాపై సోనాల్‌ లెగ్‌ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ జాగింగ్‌ డ్రస్‌ లో అమ్మడు మతిపోగొట్టేసింది. మరి ఈ అందచందాల ప్రభావంతో జనాలు అనుష్క ఓవర్‌ వెయిట్‌ లుక్‌ ను మర్చిపోయి.. కేవలం ఆ లావాటి కామెడీ మాత్రమే ఎంజాయ్‌ చేసి.. సినిమాను హిట్టు చేస్తారా? అంతా సోనాల్‌ స్వామిణి మహిమ!!

ఏదేమైనా ఈ సినిమా హిట్టవ్వడం.. అందరికంటే సోనాల్‌ కే అవసరం. పైగా అమ్మడు బికినీ వేసుకోకుండా హిట్టు కొడితే మాత్రం.. ఇక సెంటిమెంటు అనే టోన్‌ చెరిగిపోయి.. ఈమె ఎలా కనిపించినా సినిమా ఆడుద్ది.. అనే టాక్‌ వచ్చే ఛాన్సుంది.