Begin typing your search above and press return to search.

తెరపైకి దావూద్‌ చెల్లెలు హసీనా?

By:  Tupaki Desk   |   3 Aug 2015 6:44 AM GMT
తెరపైకి దావూద్‌ చెల్లెలు హసీనా?
X
అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూడ్‌ ఇబ్రహీం చరిత్ర .. సినిమా వాళ్లకు నిత్యం కథా వస్తువు. ఇప్పుడు అతడి చెల్లెలు జీవితం కూడా వెండితెరపైకి వచ్చేస్తోంది. జంజీర్‌ ఫేం అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలో దావూద్‌ సోదరి హసీనా క్యారెక్టర్‌ ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. హసీన - ది క్వీన్‌ ఆఫ్‌ ముంబై అనేది టైటిల్‌. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోంది. ముకుపుడకల సోయగం కెరీర్‌ లోనే ఇదో ఛాలెంజింగ్‌ రోల్‌. అసలింతకీ హసీన ముంబై లో ఏం చేసేది? అనేది ఈ ఆటోబయోగ్రఫీ లో చెప్పబోతున్నామని అపూర్వ లాఖియా చెబుతున్నారు.

హసీన జీవితం పూర్తి ఎమోషనల్‌. ఓ వైపు అన్న పెద్ద డాన్‌. అతడికి చెల్లిగా ముంబైలో బతకాలంటే తను అంతకుమించిన డాన్‌ అయితేనే సాధ్యం. అందుకే ముంబై లోని ఓ ఏరియాలో ఈవిడను క్వీన్‌ గా ఆరాధించేవారు. దావూద్‌ ఇబ్రహీంకి ఉన్న 12 మంది అక్కజెళ్లెల్లలో హసీన పార్కర్‌ ఒక సోదరి. ముంబై నాగ్‌ పడ ప్రాంతంలో నివశించేది. అక్కడ తనకి బోలెడుమంది అభిమానులు, శత్రువులు కూడా ఉండేవారు. అలాంటిచోట రాణిలా ఎలా బతికింది అన్నది హసీన -ది క్వీన్‌ ఆఫ్‌ ముంబై చిత్రంలో చూపించనున్నారు.

హసీన 40ఏళ్ల వయసప్పుడు గుండెపోటుతో మరణించింది. తన జీవితం అంతా ఎంతో భావోద్వేగాలతో ముడిపడినది. ఆమె మరణం అనూహ్యం అని చెబుతారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం అవుతోంది. ఇలాంటి ఓ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని సోనాక్షి చెబుతోంది. హసీన క్యారెక్టర్‌ పూర్తిగా నా వ్యక్తిగత జీవితానికి వ్యతిరేకమైనది. అందుకే ఛాలెంజింగ్‌ గా తీసుకుని నటించడానికి రెడీ అవుతున్నానని సోనాక్షి చెప్పింది.