Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరి: సోనాక్షి సెక్సీ స్టిల్

By:  Tupaki Desk   |   24 April 2018 2:19 PM GMT
ఫొటో స్టోరి: సోనాక్షి సెక్సీ స్టిల్
X
బాలీవుడ్ హాట్ బ్యూటీలకు సంబంధించిన టాప్ టెన్ లిస్ట్ ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దాదాపు  30 మందికి పైగా హీరోయిన్స్ పోటీలో స్ట్రాంగ్ గా ఉంటారు. ఒకరికి మరొకరికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అందంలో ప్రతి ఒక్కరు వావ్ అనేలా ఉంటారు. మొదట చూసిన పది మందిని ఫిక్స్ చేయాలని అనిపిస్తుంది. ఆ తరువాత చూసిన వాళ్లు కూడా అలానే ఉంటారు. ఆ మ్యాటర్ పక్కనపడితే అలాంటి బ్యూటీల్లో సోనాక్షి సిన్హా కూడా ఒకరు.

అమ్మడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ మొదటిసారే మంచి నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వయ్యారాలు ప్రదర్శించడంలో ఒక్కోసారి అమ్మడి ముందు ఎవరు సరితుగారేమో అనిపిస్తుంటుంది. ఇక మ్యాగజైన్ లకి ఇచ్చే స్టిల్స్ మరో లెవెల్లో ఉంటాయి. రీసెంట్ గా ఫెమినా కవర్ పేజ్ పై సోనాక్షి మెరిసిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్ లో తన సెక్సీ అందాలని చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేసింది. కాస్ట్యూమ్ కూడా చాలా కొత్తగా ఉంది.

సోనాక్షి ఇంతకుముందు చాలా సార్లు ఘాటుగా కనిపించినా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అందలేదు. అందరూ చాలా అందంగా ఉందని పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో అమ్మడు ప్రశంసలను ఆందుకుంటోంది. ఇక అమ్మడి చేతిలో ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి. స్టార్ హీరోలతో పాటు మంచి కాన్సెప్ట్ తో ఉన్న చిన్న బడ్జెట్ సినిమాలని కూడా చేస్తోంది.