సన్నాఫ్ లగడపాటి డెబ్యూ సినిమా ఫస్ట్ లుక్

Fri Mar 22 2019 23:31:15 GMT+0530 (IST)

టాలీవుడ్ కు కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్.  అందులోనూ ఫిల్మీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీల నుండి హీరోలు రావడం ఇంకా కామన్.  తాజాగా ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ తనయుడు లగడపాటి విక్రమ్ సహిదేవ్ హీరోగా తన లక్కును టెస్ట్ చేసుకుంటున్నాడు.  విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న 'ఎవడు తక్కువ కాదు' ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా విడుదల చేశారు.  ఈ చిత్రానికి క్యాప్షన్ 'ఎ న్యూ ఏజ్ రివెంజ్'.  హీరోగా విక్రమ్ కు ఇది మొదటి సినిమానే కానీ నటుడిగా మాత్రం కాదు.  'రేసుగుర్రం' లో అల్లు అర్జున్ చిన్నప్పటి పాత్రలోనూ.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అన్వర్ పాత్రలోనూ నటించాడు.  ముఖ్యంగా 'నా పేరు సూర్య' క్లైమాక్స్ లో అన్వర్ పాత్రలో విక్రమ్ నటన అందరినీ మెప్పించింది.  సో.. కెమెరా ముందు నటించే ఈజ్ మాత్రం కుర్రాడికి చాలా ఉంది.  ఇక 'ఎవడు తక్కువ కాదు' సినిమా విషయానికి వస్తే రఘుజయ ఈ చిత్రానికి దర్శకుడు. హరి గౌర సంగీతం అందిస్తున్నాడు. లగడపాటి శిరీష ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.

హీరో క్యారెక్టర్ గురించి హింట్ ఇస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ లో 'ఎ స్టొరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్' అనే ఒక క్యాప్షన్ ను కూడా జోడించారు.  ఈ సినిమా ఒక అందమైన టీనేజ్ ప్రేమకథ అని.. లవ్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని నిర్మాత శ్రీధర్ చెప్పారు.  చిత్రీకరణ పూర్తయిందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.  ఈ సినిమా విక్రమ్ కు మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉన్నామన్నారు. మరి ఈ కొత్త హీరోకు టాలీవుడ్ లో ఎలాంటి విజయం లభిస్తుందో వేచి చూడాలి.