Begin typing your search above and press return to search.

14 వ‌య‌సుకే రేప్ చేశారు

By:  Tupaki Desk   |   16 Oct 2018 3:34 PM GMT
14 వ‌య‌సుకే రేప్ చేశారు
X
ఐదేళ్ల వ‌య‌సులో న‌న్ను అస‌భ్యంగా తాకాల‌ని చూశారు. 14 వ‌య‌సులో రేప్ చేశారు. నా లైఫ్ జ‌ర్నీలో ఎంద‌రో మృగాళ్లు ప‌రిచ‌యం అయ్యారు. హిందీ ట్యూట‌ర్, మేక‌ప్ మేన్, ఓ ఫిలిం డైరెక్ట‌ర్ నాపై అడ్వాంటేజ్ తీసుకున్నార‌ని ఆవేద‌న వెల్ల‌గ‌క్కారు పాకిస్తానీ న‌టి సోమీ అలీ. ఈ భామ ఒక‌ప్పుడు స‌ల్మాన్ గాళ్ ఫ్రెండ్‌. త‌న‌తో క‌లిసి సినిమాల్లోనూ న‌టించింది. బాలీవుడ్ లో న‌టించేప్పుడు `ఆందోళ‌న్` ద‌ర్శ‌కుడు త‌న‌ను వేధించాడ‌ని తెలిపింది సోమి.

ఓసారి మేక‌ప్‌మేన్ పెద‌వుల్ని త‌డిమి చాలా బావున్నాయ‌ని ముద్దు పెట్టుకోబోతుంటే ఎస్కేప్ అయ్యాన‌ని, ఆ స‌మ‌యంలో ఆ ప‌క్క రూమ్‌లో ఉన్న నాన్న‌గారు రావ‌డంతో ఆ ముప్పు త‌ప్పింద‌ని తెలిపింది. ఆ ఘ‌ట‌న త‌ర్వాత మేక‌ప్ చేసేప్పుడు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంచ‌మ‌ని త‌న డాడ్ చెప్పార‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం `నో మోర్ టియ‌ర్స్ డాట్ ఓఆర్‌జీ` అధినేత‌గా.. తాను హ్యూమ‌న్ ట్రాఫికింగ్ & డొమెస్టిక్ వ‌యొలెన్స్ వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని ఆ చిక్కుల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు, ఆదుకునేందుకు కంపెనీని ర‌న్ చేస్తున్నారు.

తాజాగా మీటూ ఇండియా ఉద్య‌మం ఉధృతి నేప‌థ్యంలో దాదాపు 40 ఏళ్ల కింద‌ట త‌న జీవితంలో ఎదురైన ఎన్నో సంగ‌తుల్ని సోమి అలీ గుర్తు చేసుకున్నారు. వీటిని స‌మాజిక మాధ్య‌మాల వేదిక‌గానూ వెల్ల‌డించారు. బాలీవుడ్‌లో త‌నూశ్రీ ద‌త్తా ధైర్యంగా ముందుకు రావ‌డాన్ని స‌మ‌ర్ధిస్తూ తాను బాస‌ట‌గానూ నిలిచారు. ఇలా మ‌రెంద‌రో బాధితులు బ‌య‌ట‌కు రావాల‌ని ధైర్యంగా జ‌రిగిన‌వి చెప్పాల‌ని నిన‌దించారు. నన్ను ముద్దు పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన స‌ద‌రు మేకప్‌మేన్ మాధురి ధీక్షిత్‌కి ప‌ర్స‌న‌ల్‌ మేక‌ప్ మేన్ అని సీక్రెట్‌ని ఓపెన్ చేశారు సోమి అలీ. ఆ ట్యూట‌ర్ పేరు గౌత‌మ్ అంటూ అత‌గాడి పేరును సోమి రివీల్ చేయ‌డం విశేషం.